కులగణన కు ను ప్రతి ఒక్కరూ సహకరించాలి

జోగులాంబ గద్వాల5 నవంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:-మానవపాడు. మండల పరిధిలోని బూడిదపాడు గ్రామంలో జిల్లా కలెక్టర్ బి ఎం సంతోష్ ఆదేశాలతో డిపిఆర్ఓ రఫీయుద్దీన్ సారథ్యంలో తెలంగాణ సాంస్కృతిక సారధి ఉద్యోగులు ప్రజలకు డ్రగ్స్ నిర్మూలన,రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కులగనణ సర్వే,బాల కార్మిక నిర్మూలన వ్యవస్థ పై ప్రజలకు పాటల ద్వారా అవగాహన కల్పించారు. ఈనెల 6 నుండి గ్రామాలలో నిర్వహించే కుల గణన కార్యక్రమానికి సహకరించి విజయవంతం చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు, వృద్ధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు రమాదేవి, కేశవులు, ప్రసాదు, స్వామి, కవిత, హజరత్, కృష్ణ, భూపతి, రాహుల్ పాల్గొన్నారు.