ఆరు గ్యారంటీ పథకాలపై ప్రభుత్వ కళాకారుల ఆట పాట

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జోరుగా సాగుతున్న ప్రభుత్వ పథకాల ప్రచారం

Nov 30, 2024 - 18:34
 0  13

జోగులాంబ గద్వాల 30 నవంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఐజ మండలం తెలంగాణ ప్రభుత్వంలో ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ఆరు పథకాలు అమలుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ప్రజా విజయోత్సవాల గురించి ప్రజలకు పాటల ద్వారా అవగాహన కల్పించారు. జిల్లా కలెక్టర్ బి, ఎం సంతోష్  ఆదేశాలతో డిపిఆర్ఓ అరిపు ద్దీన్ సారథ్యంలో ఐజ మండలం తహసీల్దార్  జ్యోతి, ఆర్ ఐలు మధుస్వామి,  రజినీకాంత్ రెడ్డి  అధ్యర్యంలో జోగులాంబ గద్వాల జిల్లా సాంస్కృతిక సారధి అధ్యక్షులు రాహుల్ కళ బృందంచే ఐజ మండలం బింగుదొడ్డి చిన్న తాండ్ర పాడు గ్రామాల్లో శనివారం ప్రదర్శనలిచ్చారు . రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంలో అమలు చేసిన ఆరు గ్యారంటీలు మరియు సంక్షేమ పథకాలపై ఈనెల 19 నుండి డిసెంబర్ 7 వరకు 19 రోజులపాటు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా విజయోత్సవాలను నిర్వహిస్తున్నది. ఇందులో ప్రభుత్వం అమలు చేసిన గ్యారెంటీలలో మహిళలకు ఆర్టీసీలో ఫ్రీ బస్సు ప్రయాణం, రూ.500 లకు సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇందిరా మహిళా శక్తి, 50,000 ఉద్యోగాలు, రుణమాఫీ, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు తదితర పథకాలను కళారూపాల ద్వారా ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  కళాకారులు భూపతి, రమదేవి, హజ్రత్, కృష్ణ, స్వామి, కవిత, కేశవులు తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333