కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధించాలి

తిరుమలగిరి 09 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే గ్రామీణ ప్రాంత విద్యార్థులు కార్పొరేట్ పాఠశాల కు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించేలా, వారికి కి మెరుగైన శిక్షణా నైపుణ్యాలతో విద్యాబోధన, వసతి సౌకర్యాలు కల్పిస్తూ వారు విద్యా ప్రగతిని సాధించడానికి వందేమాతరం ఫౌండేషన్ చేయూతనందిస్తుంది. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిరుమలగిరిలో పదవ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించే లక్ష్యంతో ""శత శాతం"" ఉత్తీర్ణత నినాదం తో మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న సుమారు 300మంది పదవ తరగతి విద్యార్థులకు ప్రేరణ తరగతులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ రవీంద్ర Raveendra విద్యార్థులకు మార్గ నిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణలో చదువుపట్ల శ్రద్ధాసక్తులు కనబరిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ప్రభుత్వ అందించే అన్ని రకాల సౌకర్యాలను అందిపుచ్చుకొని ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. తల్లిదండ్రుల పట్ల ఉపాధ్యాయుల పట్ల తోటి విద్యార్థుల పట్ల సమాజం పట్ల సత్ప్రవర్తన కలిగి సచ్ఛీలతతో ముందుకు సాగాలని వారు సూచించారు తెలుగులో బెదరకోట రాజు, హిందీ గుంటి సత్యనారాయణ ఇంగ్లీష్ సబ్జెక్టు చిల్లంశెట్ఠి రవీందర్, గణితం దామళ్ళ ఎల్లయ్య, భౌతిక రసాయన శాస్త్రం జమాల్ షరీఫ్, సాంఘిక శాస్త్రంలో బోసు బాబు లు విద్యార్థులకు పరీక్షల పట్ల అవగాహన కలిగించారు. ఇందులో వారు పరీక్ష పేపర్ మోడల్ మరియు ఏ పాఠ్యాంశాలను ఏ విధంగా చదవాలి అనే అంశాలపై వివరణ ఇచ్చారు కార్యక్రమంలో మండల విద్యాధికారి ఐ శాంతయ్య పాఠశాల ప్రధానోపాధ్యాయులు దామర శ్రీనివాస్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బాల్తు శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు గజ్జల అశోక్, శ్రీనివాస్ పాల్గొన్నారు వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.