కామ్రేడ్ లింగన్నకు చివరిసారి కన్నీటి వీడ్కోలు

May 28, 2025 - 21:12
 0  3
కామ్రేడ్ లింగన్నకు చివరిసారి కన్నీటి వీడ్కోలు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్  ఈ దోపిడి వ్యవస్థ పై పోరుచేసిన వీరబోయిన లింగన్న. కామ్రేడ్ వీరబోయిన లింగన్న ఈ దోపిడీ వ్యవస్థ మారాలంటే శాస్త్రీయ విద్యా లక్ష్యంగా తన పోరాటాన్ని విద్యార్థి దశలో కొనసాగించి రాష్ట్ర నేతగా ఎదిగిన గొప్ప విద్యార్థి నాయకుడని సిపిఐ(ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం. డేవిడ్ కుమార్ అన్నారు. కామ్రేడ్ వీరబోయిన లింగయ్య గుండె సంబంధిత సమస్యతో హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈరోజు ఆయన అంత్యక్రియలు ఏపూర్ గ్రామంలో సిపిఐ(ఎమ్.ఎల్) న్యూ డెమోక్రసీ, పిడిఎస్ యు ఆధ్వర్యంలో సంతాప సభ, అంతక్రియలు జరిపారు. ఈ సభకు మాజీ పిడిఎస్ యు డివిజన్ అధ్యక్షులు బొల్క పవన్ అధ్యక్షత వహించారు. లింగన్న స్మరిస్తూ సభలో రెండు నిమిషాలు మౌనం పాటించి, ఆయన భౌతికాయానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. ఈ సందర్భంగా ఎం.డేవి కుమార్ పాల్గొని మాట్లాడుతూ విప్లవోద్యమం ఉన్న ఏపూర్ గ్రామంలో కామ్రేడ్ లింగన్న జన్మించి ఆ రాజకీయ ప్రభావంతో విద్యార్థి దశలో పిడిఎస్ యు జెండాను ఎత్తుకొని ఈ వ్యవస్థ మార్పు కోసం, ఉన్నత, పేద అనే తేడా లేకుండా అందరికీ సమానమైన శాస్త్రీయ విద్య కావాలని, కామన్ విద్యా విధానం కావాలని, ప్రైవేటు విద్యాసంస్థలలో జరుగుతున్న ఫీజుల దోపిడీ అరికట్టాలని, సంక్షేమ హాస్టల్స్ విద్యార్థుల కు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పోరాడిన గొప్ప విద్యార్థినేతని అన్నారు. అదేవిధంగా ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నాగయ్య,న్యూడెమోక్రసీ పార్టీ నల్గొండ జిల్లా కార్యదర్శి ఇందూరు సాగర్, పిడిఎస్ యు జాతీయ నాయకులు పి. మహేష్, పిడిఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు లు మాట్లాడుతూ వీరబోయిన లింగన్నతో స్నేహం చేస్తే మరువలేమని ఆయన ఎన్ని కష్టనష్టాలు వచ్చినా మనసులో పెట్టుకొని జయించడం కోసం ప్రయత్నం చేసేవాడని, తన వ్యక్తిగత జీవితాన్ని వదులుకొని ఉద్యమమే జీవితం గా విద్యార్థి దశలో అనేక పోరాటాలకు నాయకత్వం వహించడం గొప్ప విషయమని ఆయనను కొనియాడారు. ఇంకా ఈ అంతిమ యాత్రలో అడ్వకేట్ ధర్మార్జున్, ఐఎఫ్ టి యు జిల్లా ఉపాధ్యక్షులు కునుకుంట్ల సైదులు, ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శంకర్, ఏఐకేఎంఎస్ జిల్లా సహాయ కార్యదర్శి అలుగుబెల్లి వెంకటరెడ్డి, అరుణోదయ జిల్లా ప్రధాన కార్యదర్శి కంచనపల్లి సైదులు, పార్టీ డివిజన్ నాయకులు ఎస్ కే.జిలేరు, దేశోజు మధు, పిడిఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలేబోయిన కిరణ్,బోనగిరి మధు,రాకేష్, పిడిఎస్ యు రాష్ట్ర సహాయ కార్యదర్శి కంచనపల్లి శ్రీను, పిడిఎస్ యు జిల్లా అధ్యక్షులు పుల్లూరు సింహాద్రి, ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా అధ్యక్షులు ఉపేందర్, అరుణోదయ జిల్లా అధ్యక్షులు ఉదయగిరి, రాష్ట్ర నాయకులు నాగమల్లు, ఎర్ర ఉమేష్, బొల్ల వెంకన్న, గండు నగేష్,సామ నర్సిరెడ్డి, పి వై ఎల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నల్గొండ నాగయ్య, డి రవి, పి వై ఎల్ జిల్లా కోశాధికారి బండి రవి,నాయకులు బోనగిరి గిరి బాబు, పిఓడబ్ల్యు జిల్లా సహాయ కార్యదర్శి రామలింగమ్మ,బీసీ సంఘం రాష్ట్ర నాయకులు వీరన్న, న్యూ డెమోక్రసీ గ్రామ కార్యదర్శి సుధగాని వెంకన్న, ఎస్.కె మైబేళ్లి,మందడి శ్రీధర్,పిడమర్తి భరత్,రాజేష్,రాచకొండ ఉదయ్,దండి ప్రవీణ్, ఎల్ ఎన్ రాజు, జెన్నిసార్ జీవిత సహచరనీ కలక్కా,గ్రామ నాయకులు రవి గోపాల్,డప్పు రమేష్, మద్దెల వేణు, మధుసూదన్ రెడ్డి, అబ్రహం, శ్రీశైలం,పల్లవి, లింగయ్య పెద్ద నాన్న బిక్షం, తదితరులు పాల్గొన్నారు.