కాంగ్రెస్ పార్టీ లో భారీగా చేరికలు 

Jan 29, 2026 - 19:34
 0  35
కాంగ్రెస్ పార్టీ లో భారీగా చేరికలు 

 సొంత గూటికి చేరుకున్న మాజీ కౌన్సిలర్ డీలర్ శ్రీనివాస్ 

 కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్.

 జోగులాంబ గద్వాల 29 జనవరి 26 తెలంగాణ వార్తా ప్రతినిధి : వడ్డేపల్లి మునిసిపాలిటీ చెందిన మాజీ కౌన్సిలర్ విజయలక్ష్మి శ్రీనివాస్ (డీలర్ శ్రీను)  ఈరోజు బి ఆర్ ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వారికి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్.ఎస్.ఏ.సంపత్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు.


 ఈ కార్యక్రమంలో జోగులంబ ఆలయ కమిటీ మాజీ చైర్మెన్ కొంకల నాగేశ్వర్ రెడ్డి , వడ్డేపల్లి పట్టణ అధ్యక్షులు చిన్నబాబు, మండల అధ్యక్షులు రామకృష్ణ రెడ్డి, మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నాగ శిరోమణి, RDS మాజీ చైర్మెన్ తనగల సీతారామ రెడ్డి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333