కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చారిత్రాత్మహం...

Mar 21, 2025 - 20:21
 0  3
కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చారిత్రాత్మహం...
కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చారిత్రాత్మహం...

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ శుభ పరిణామం...

ఎస్సీ వర్గీకరణ ఆమోదం గొప్ప విషయం...

యువ వికాసం ద్వారా యువతకు చేయూత...

కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు 

కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు ఆధ్వర్యంలో బీసీ బిల్లు 42 శాతం ఆమోదం పొందడం ఎస్సీ వర్గీకరణకు అంగీకారం తెలపడం యువ  వికాసం పథకం ద్వారా యువతకు చేయూత నందించడం వంటి ప్రతిష్టాత్మక నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్న తరుణంలో భాగంగా శుక్రవారం కోరుట్ల పట్టణ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం నుండి నంది చౌక్ కార్గిల్ కొత్త బస్టాండ్ మీదుగా డైమండ్ హోటల్ వరకు అక్కడ నుండి మళ్లీ తిరిగి కొత్త బస్టాండ్ ముందు గల అంబేద్కర్ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగరావు అనంతరం కాంగ్రెస్ పార్టీ అధినేత పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ భారత దేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రాలు చేయలేని సాహసోపేత నిర్ణయాలను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకోవడం జరిగిందని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీల అమలు చేయడమే కాకుండా ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తూ ప్రజా ప్రభుత్వంగా ప్రజల ముందుకు వెళుతుందన్నారు కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా అసెంబ్లీలో బీసీ బిల్లు 42 శాతం ఆమోదం పొందడం శుభపరిణామమని దీని ద్వారా బీసీలకు ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు పెరుగుతాయన్నారు అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలపడం గొప్ప విషయమన్నారు ఎన్నో ఏళ్లుగా బీసీలు ఎదురు చూస్తున్న రిజర్వేషన్లు బిసి డిక్లరేషన్ ద్వారా బీసీలకల నెరవేరబోతుందన్నారు బీసీ రిజర్వేషన్లు పెరగడం వల్ల రాబోయే రోజుల్లో అధిక శాతం బీసీలకు అవకాశాలు ఉంటాయన్నారు కావున ఇట్టి సదవకాశాన్ని బీసీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కృషి చేసే ప్రభుత్వం కాబట్టి గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించారన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నామన్నారు అలాగే యువ వికాసం పథకం ద్వారా యువతకు చేయూతనందించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లక్ష రూపాయల నుండి మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తుందని ఇట్టి అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు ముఖ్యంగా నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేస్తే సాధించలేనిది అంటూ ఏదీ ఉండదని కావున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలన్నారు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలకు సుమారు నెలకు 5 వేల రూపాయల వరకు ఆర్థిక ఇబ్బందులు తొలగించడం జరిగిందన్నారు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలు చాలావరకు పుణ్యక్షేత్రాల దర్శనాలు చేసుకోవడం జరుగుతుందన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను గ్రామ గ్రామాన తెలియజేస్తూ గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించాలనీ కోరారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏ సమస్య ఉన్న మీడియేటర్ వ్యవస్థ లేకుండా స్వయంగా తనకు సమాచారం అందిస్తే ఆ సమస్య పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానన్నారు ఈకార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు తోపాటు కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొంతం రాజం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు గడ్డం వెంకటేష్ గౌడ్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎంఏ నయీమ్ మ్యాకల నర్సయ్య ఎంబేరి సత్యనారాయణ చిటిమెల్లి రంజిత్ గుప్తా మచ్చ కవిత  రిజ్వాన్ పోతుగంటి శంకర్ గౌడ్ నాయకులు అన్నం అనిల్ ఆడెపు మధు పుప్పాల ప్రభాకర్ బలిజ రాజారెడ్డి భూమారెడ్డి  చిట్యాల  లక్ష్మీనారాయణ మోర్తాడ్ లక్ష్మీనారాయణ రాంచంద్ రావు  సోగ్రాభి ఎడ్ల రమేష్ కట్కమ్ దివాకర్ మ్యాదరి లక్ష్మణ్   యటం అరుణ్  సదుల వెంకటస్వామి బద్ది మురళి  చిలువేరి విజయ్  అయిండ్ల గణేష్ ఏనుగు రాకేష్ ముల్కప్రసాద్ వసీద్ అయూబ్ ముజబిత్ జగన్నాథ్ లక్ష్మణ్ వాసం అజయ్ సరికేలా నరేష్ చేపూరి కృష్ణారెడ్డి పడాల లచ్చయ్య కిసాన్ సెల్ మండల అధ్యక్షులు నర్సయ్య దండిక కిషోర్ వోలేపు రాజేష్ గాదెల విజయ్ గాదెల అశోక్  శ్రీకాంత్ జికూరి కిషోర్  పలువురు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333