వెల్దేవి గ్రామంలో హనుమాన్ విజయోత్సవాలు

పండితులు చెంగోలు శ్రీధరా చార్యులు

Apr 12, 2025 - 23:27
Apr 12, 2025 - 23:29
 0  58
వెల్దేవి గ్రామంలో హనుమాన్ విజయోత్సవాలు

అడ్డగూడూరు12 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామంలో శ్రీశ్రీ ఆంజనేయస్వామి విజయోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.స్వామివారికి చేండురం తిలకం దిద్ది తమలపాకులు అద్ది వేద పండితుల మంత్ర యజ్ఞంతో అంగరంగ వైభవంగా జరిగిన ప్రతిరోజు పూజలు నిర్వహిస్తుంటారు. స్వామివారికి అభిషేకం పూజ, సింధూరం పూజ, అష్టోత్తరం పూజ, ఆకు పూజ చేయడం జరిగిందని అన్నారు.గ్రామంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో,అష్ట ఐశ్వర్యాలతో,పాడిపంటలతో, 

ప్రజలంతా ఉండాలని స్వామివారిని కోరుతున్నట్లు పండితులు శ్రీధర్ చార్యులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పండితులు శ్రీధర్ చార్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.