కవిత్వం అంతరాంతర జ్యోతిస్సీ మల్ని  బహిర్గతం చేయాలి

Mar 21, 2025 - 20:06
 0  5
కవిత్వం అంతరాంతర జ్యోతిస్సీ మల్ని  బహిర్గతం చేయాలి

మనం వికాస వేదిక అధ్యక్షుడు పెద్దిరెడ్డి గణేష్
కవిత్వం అనేది అంతరాంతర జ్యోతిస్సీ మల్ని బహిర్గతం చేయాలని, కవిత్వం అనేది నిరంతర అంతరాంతర రస జ్వలమని ప్రముఖ కవి, మనం వికాస వేదిక అధ్యక్షులు పెద్దిరెడ్డి గణేష్ చెప్పారు. ప్రపంచ కవితా దినోత్సవాన్ని పురస్కరించుకొని సుధా బ్యాంకు ఆడిటోరియంలో శుక్రవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు.  అగ్ని చల్లినా, అమృతం కురిసినా ఆనందం కవిత్వం పరమావధి కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలువురు కవులు జి వెంకటేశ్వర్లు, ఏబిల్ శశి, షీలా అవిలేను, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ కృష్ణ, కందుకూరి యాదగిరి, గడ్డం కృష్ణారెడ్డి, కుసుమ సిద్ధారెడ్డి, కవిత, పోతుగంటి వీరాచారి తదితరులు తమ తమ కవితల్ని  వినిపించారు. సూర్యాపేటలో ఏప్రిల్ నుండి ప్రతినెల కవి సమ్మేళనం నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. కవిత గానం చేసిన కవులకు ప్రశంస పత్రాలు అందజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333