కాంగ్రెస్ పార్టీ గెలిచాక ఉపాధి హామీని వ్యసాయనికి అనుసంధానం చేయనున్నాం
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి..

నిజామాబాద్ 30 మార్చ్ తెలంగాణవార్త:ప్రతినిధి :- మోడీ ప్రభుత్వం ఎన్నికల కోసమే పసుపు బోర్డ్ తెస్తామని ప్రకటన చేశారని ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు.సంవత్సారం క్రితమే వరంగల్ సభలో మా నాయకులు రాహుల్ గాంధీ 15 వేల మద్దతు ధర ఇప్పిస్తామని హామీ ఇచ్చారని, మా ప్రభుత్వం రాగనే రాహుల్ గాంధీ హామీ అమలు చేస్తారని అన్నారు.శనివారం నిజామాబాద్ ముఖ్య నాయకుల సమావేశం రూరల్ నియోజక వర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు అందరూ ముక్త కంఠంతో భారీ మెజారిటీ తో గెలిపించుకుంటామని నినాదాలు చేశారు.
ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ..యావత్ నిజామాబాద్ కాంగ్రెస్ నాయకత్వం నా కోసం పని చేస్తామని చెప్పడం సంతోషకరం అన్నారు.దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని భావనతో ప్రజలు ఉన్నారని,దేశంలో కాంగ్రెస్ పార్టీ జండా ఎగురవేయనున్నదని అన్నారు. జాతీయ స్థాయిలో ఉత్పదక రంగం వ్యవసాయం అని ఆ వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి అభివృద్ది చేయవల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుందని కానీ మోడీ ప్రభుత్వం అందుకు కృషి చేయలేదని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కోసం ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు.ఎలాంటి బాధ్యత లేని మీ ప్రభుత్వం ప్రజలకు అవసరం లేదని,మద్దతు ధర కోసం చట్ట బద్దత కల్పించడానికి రాహుల్ గాంధీ ఆ వైపు కృషి చేస్తున్నారని అన్నారు.రైతులు అప్పుల ఉభి లో కుడుకు పోతుంటే మోడీ ప్రభుత్వం మాత్రం రైతులను ఆడుకొలేదని అన్నారు. రైతును ఋణ మాపి చేస్తే సోమరి పాతూ అవుతారని చెప్పే మోడీ,అంబానీ ఆదాని లకు 6 వేల కోట్లు మాపీ చేసి వారిని సోమరులు చేయలేదా అని అన్నారు.
2001-02 లో మాత్రమే చక్కెర కర్మాగారాలు ప్రైవేట్ పరం అయ్యాయని అపుడు తెలుగు దేశం పాత్ర ఎంత ఉందో, బీజేపీ ది కూడా అంతే పాత్ర ఉన్నదని అన్నారు. బీ అర్ ఎస్ హయాంలో మూత పడ్డాయని అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉంటేనే అభివృద్ది జరుగుతుందని అన్నారు.
78 వేల కోట్ల బడ్జెట్ 63 కోట్లకు ఎందుకు తగ్గింది అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచాక ఉపాధి హామీని వ్యసాయనికి అనుసంధానం చేస్తామన్నారు. బీజేపి ప్రభుత్వం లో ఎరువులు పెరిగాయని అన్నారు. రైతాంగానికి పెట్టుబడి కల్పిస్తామని అన్నారు. 2014 లో క్రూడాయిల్ ధర ఏముండే,ఇప్పుడు ఏముంది అన్నారు.మోడీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి,ప్రభుత్వం రంగ సంస్థలు అమ్మకానికి పెట్టారు.
విదేశీ మారక ద్రవ్యాన్ని గల్ఫ్ కార్మికులు ఆదాయం సమకురుస్తుంటే గల్ఫ్ బాధితులకు ఎలాంటి నష్ట పరిహారం ఇవ్వలేదని,గల్ఫ్ కార్మికులు చనిపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ద్వారా 5 లక్షలు ఇవ్వనున్నామని అన్నారు.
బీడీ కార్మికులకు నాలుగు వేలు ఇవ్వనున్నామని, 2014 తరువాత పి ఎఫ్ కట్ అయిన వారందరికీ కూడా అందజేస్తామన్నారు. గెలిచాక తెలంగాణ హక్కుల సాధన కోసం పాటు పార్లమెంట్ లో నా గళం వినిపించి,సాధన కోసం పాటు పడతానని అన్నారు. నిజామాబాద్ నియోజక వర్గం నిర్మాణానికి తోడ్పడుతా అన్నారు.ఇక్కడ నాయకులు పని చేయాలంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం నాయకులు ఆ వైపు ఆలోచించే వారు ఉండాలని అప్పుడే రాష్ట్ర లు,జిల్లాలు అభివృద్ది చెందుతాయని అన్నారు.
మోడీ ప్రభుత్వం
ఎన్నికల కోసమే పసుపు బోర్డ్ తెస్తామని ప్రకటన చేశారు.
మా నాయకులు వరంగల్ సభలో లో ప్రకటించారు పసుపు రైతులకు 15 వేల మద్దతు ధర వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారని
గుర్తు చేశారు.గిట్టు బాటు లేక రైతులు గతంలో కంటే తక్కువగా సాగు చేస్తున్నారని కాంగ్రెస్ కేంద్రంలో గెలిచాక రైతులు పసుపు సాగు ఎక్కువగా చేస్తారని అన్నారు. నాది నిజామాబాద్ నియోజక వర్గం కదా అని ప్రశ్నించారు.మీ మోడీ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారని అడిగారు.
బిసీ,ఎస్ సి,ఎస్టీ,మైనారిటీ ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. మూడు నెలల్లో ఐదు ఎకరాల లోపు రైతులకు రైతు బంధు ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని కాంగ్రెస్ అంటేనే ప్రజల ప్రభుత్వమని గుర్తు చేశారు.
అరు సార్లు రైతులు నష్ట పోతే రాని కేసీఆర్ రేపటి నుంచి రైతుల వద్దకు ఏం ముఖం పెట్టుకొని రైతుల వద్దకు పోతావని అన్నారు.ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని ఇందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు.బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అరవింద్ డి ఎన్ యు కాంగ్రెస్ అని,ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ సీనియర్ నేత అని ఆయన కాంగ్రెస్ నాయకుడని మొదటి సారి ఎన్నికల్లో అరవింద్ కాంగ్రెస్ పార్టీ శ్రీనివాస్ కొడుకని ఓట్లు వేశారని, గెలిచిన ఐదేళ్లలో నిజామాబాద్ కు ఎలాంటి అభివృద్ది చేయలేదని అన్నారు.కాంగ్రెస్ డబ్బుతో చదువుకొని,ఆస్తులు సంపాదించి మాపై పోటీ చేయడానికి వస్తె చూస్తూ ఉరుకుంటామా తప్ప ఉజ్కుండా ఒడిస్తామని అన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, బోధన్ ఎమ్మేల్యే సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఉర్దూ ప్రెస్ అకాడమీ చైర్మన్ తహేర్ బిన్ హందాన్,రూరల్ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి,అనిల్, జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి,నాయకులు అన్వేష్ రెడ్డి,అరికెల నర్సరెడ్డి, వినయ్ రెడ్డి,ముత్యాల సునీల్ రెడ్డి,
లక్ష్మణ్ కుమార్,పట్టణ అధ్యక్షులు కేశ వేణు,ఆకుల సుజాత,పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.