ఫోన్ ట్యాపింగ్ తో ప్రశ్నించే గొంతును నొక్కిండ్రు
: ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి
* ఫోన్ ట్యాపింగ్ పై రాష్ట్ర డిజిపి కి పిర్యాదు చేసిన ఎమ్మెల్యే
* ఫోన్ ట్యాపింగ్ లో రాష్ట్రమంతా బాధితులే...
* నేను ఫోన్ ట్యాపింగ్ బాధితునే
* గత 5 సంవత్సరాలుగా నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు
* ప్రతి జిల్లా కు ఒక కాంప్లెంట్ సెల్ ఏర్పాటు చేయాలి
* రాజకీయ వేత్తలను , వ్యాపార వేత్తలను ఫోన్ ట్యాపింగ్ తో బెదిరింపులకు గురి చేశారు.
రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ వ్యక్తి యొక్క ప్రైవేటు జీవితంలోకి తొంగి చూసి, వారి స్వార్థానికి ఉపయోగించుకోవడం దుర్మార్గమైన చర్య గా, హేయమైన చర్యగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు అభివర్ణించారు. ఈ రోజు హైదరాబాదులోని డిజిపి కార్యాలయంలో ఫోన్ ట్యాపింగ్ పైన పిర్యాదు చేసి, ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు హరించే విధంగా ఆర్టికల్ 14,19,21 లను ఉల్లంఘనకు గురిచేస్తూ, నాటి మంత్రి రాజకీయ ప్రత్యర్ధుల మీద, వ్యాపారస్తుల మీద , పౌరహక్కుల నేతల మీద, పత్రికా విలేఖరులను మీద ఫోన్ ట్యాపింగ్ అనే బ్రహ్మాస్త్రం ఉపయోగించి వారి జీవితాలతో చెలగాటం ఆడారని ఆయన ఆరోపించారు.
గత ఐదు సంవత్సరాలుగా తన ఫోన్, తన బంధువులు, స్నేహితుల ఫోన్లను, రాజకీయ నాయకుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని ఆయన మండిపడ్డారు. రాజకీయ నాయకులు పోలీసుల అపవిత్ర మైన కలయికతోనే ప్రజలు యొక్క స్వేచ్ఛ కు విఘాతం కలిగించే విధంగా రీడింగ్ రూం, బెడ్రూం లోకి తొంగి చూసే విధంగా నాటి మంత్రి కి ఫోన్ ట్యాపింగ్ రికార్డు పోలీసులు అందించారని రాష్ట్ర డిజిపి గారికి, సిట్ శ్రీనివాస్ రెడ్డి కమీషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ గారికి పూర్తి ఆధారాలు అందించానని ఆయన చెప్పారు. డిజిపి, సిట్ శ్రీనివాస్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతున్న విచారణ ను పూర్తి స్థాయిలో జరిపించాలని , ఎవరి ఒత్తిడి మేరకు, ఎవరి ఆదేశానుసారం అనధికార ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారో తెలియజేయాలని, ఫోన్ ట్యాపింగ్ కు చరమగీతం పాడాలని, దోషులు ఎవరైనా ఏ స్థాయిలోని వారైనా కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టి పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్ పి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు