ఒకే పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయుల బదిలీ ఆత్మీయ సమ్మేళనం

Jul 12, 2024 - 18:53
Jul 13, 2024 - 16:57
 0  5
ఒకే పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయుల బదిలీ ఆత్మీయ సమ్మేళనం

ఒకే పాఠశాల లోని ఇద్దరు ఉపాధ్యాయుల బదిలీ ఆత్మీయ సమ్మేళనం

 తెలంగాణ వార్త పెన్ పహాడ్: పొట్లపహాడ్ గ్రామంలోని యుపిఎస్ పాఠశాలలోని ఇద్దరు ఉపాధ్యాయులు పదవి ఉన్నతి మీద బదిలీ అయ్యారు ఒకరుమామిడి వెంకటయ్య గత 13 సంవత్సరాల నుంచి ఇదే పాఠశాలలో పనిచేస్తూ ఉత్తమ మండల జిల్లా రాష్ట్ర ఉపాధ్యాయునిగా అవార్డులను ఇదే పాఠశాల నుంచి అందుకున్నారు పాఠశాల పెద్దగా ముందుండి పిల్లలకు ఏదైనా అవసరమైతే దానిని కూడా పెట్టడంలో ముందున్నారు ఇప్పుడు దోస పహాడ్ పాఠశాలకు బదిలీ అయ్యారు మరొక ఉపాధ్యాయుడు ఇటుకల నాగరాజు గత ఎనిమిది సంవత్సరాలుగా ఇదే పాఠశాలలో అన్ని కార్యక్రమాలలో ముందుండి పాఠశాలను నడిపించేవాడు ఇప్పుడు ధూపడు గ్రామ యుపిఎస్ పాఠశాలకు బదిలీ కావడం ఎంతో బాధను కలిగిస్తుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అన్నారు ఇద్దరు ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఈ పాఠశాలను వదిలిపెట్టి వెళ్లడం ఎంతో బాధ కలిగిస్తుందని సొంత ఇంటిని వదిలి వెళ్లడం ఎంతో కష్టంగా ఉంది అన్నారు పిల్లలు కన్నీరు పెట్టి ఏడ్చారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రేణుకా దేవి పాఠశాల పాఠశాల ఉపాధ్యాయులు పిచ్చిరెడ్డి లక్ష్మయ్య విజయ్ కుమార్ గ్రామ సర్పంచ్ రామునేని పుష్పావతి కృష్ణయ్య ఎంపీటీసీ మేకపోతుల సైదమ్మ సీతారాములు ఉప సర్పంచ్ దాచుపల్లి నాగయ్య చైర్మన్ చల్ల పద్మమ్మ వినోద్ రెడ్డి మాజీ ఎంపీటీసీ నూకల రాజ్యలక్ష్మి చల్ల సత్యనారాయణ రెడ్డి యూత్ అధ్యక్షులు గంగారపు సైదులు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు

Harikrishna Penpahad Mandal Reporter Suryapet Dist Telangana State