ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఎస్సై మరియు కానిస్టేబుల్

తిరుమలగిరి జనవరి 28 జనవరి 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు ఈ మేరకు ఎస్ఐ సురేష్ మరియు కానిస్టేబుల్ నాగరాజు పిడిఎస్ బియ్యం కేసులో లక్ష రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు సిద్దిపేట జిల్లా వడ్డేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో అధికారులు దాడులు జరిపి పట్టుకున్నారు