ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి.

Jun 19, 2026 - 22:24
Jun 19, 2026 - 22:25
 0  2
ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి.
ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి.

జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్.

జోగులాంబ గద్వాల జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ఓటర్ జాబితా లో ఎలాంటి తప్పిదాల కు అవకాశం లేకుండా సమగ్రంగా రూపొందించేందుకు పట్టిన ఎస్ ఐ ఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ. వీఎల్ఏలకు బి ఎల్ ఓ లకు ఈనెల 24 లోగా శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేయాలని అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఈనెల 25వ తేదీ నుంచి బిఎల్ఓ లకు పోలింగ్ స్టేషన్ పరిధిలోని ఓటర్ల ఇంటింటికి ఎనుములేటర్ పారాలను అందజేయాలన్నారు. అక్టోబర్ ఒకటి తేదీన తుది ఓటరు జాబితా ప్రకటించే వరకు షెడ్యూల్ ప్రకారము ఆయా కార్యక్రమాలను సజావుగా నిర్వహించాలన్నారు. స్పెషల్ ఇంటెన్స్ రివిజన్ పై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.గద్వాల ఐడిఓసి సమావేశ మందిరంలో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి సంబంధిత జిల్లా అధికారులతో కలిసి వి సి లో పాల్గొన్నారు. గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మాట్లాడుతూ. జిల్లాల్లో ఎస్ హై ఆర్  ప్రక్రియను షెడ్యూల్ ప్రకారము నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బూతు లెవల్ అధికారులు శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేశామని కి మ్యాపింగ్ డేటా అని అందజేయడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు. ట్రైనింగ్ కలెక్టర్లు మనోహర్ కుమార్ రెడ్డి. రాజ్ కుమార్. ఎన్నికల విభాగం అధికారి మంజుల సురేషు తదితరులు పాల్గొన్నారు

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State