ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రాజకీయాలు.* మెజారిటీ ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా ఓటర్ల తీర్పులు.*

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రాజకీయాలు.* మెజారిటీ ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా ఓటర్ల తీర్పులు.* ప్రతిభ, నిజాయితీ, సేవకు గుర్తింపు లేదా?

Mar 8, 2025 - 11:10
 0  4

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రాజకీయాలు.* మెజారిటీ ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా ఓటర్ల తీర్పులు.* ప్రతిభ, నిజాయితీ, సేవకు గుర్తింపు లేదా?

************************************

---వడ్డేపల్లి మల్లేశం 9014206412 

----04...03...2025*******************

వ్యక్తం కాకపోయినా ప్రజల అభిప్రాయాలు ఒక రకంగా శానుకూలంగా ఉంటే రాజకీయ పార్టీలు కొద్దిమంది అభిప్రాయాలను మాత్రమే నిజం చేస్తూ ఎన్నికల ఫలితాలు వెలువడడం ఆశ్చర్యమేమీ కాదు. వాటి వెనుక దాగి ఉన్నటువంటి కుట్టలు కుతంత్రాలు, అవినీతి బాగోతాలు ప్రధాన కారణమని ఇంకా తెలుసుకోలేకపోతే 77 ఏళ్ల ప్రజాస్వామ్యాన్ని అంచనా వేయలేము. " ప్రజలు సాధారణంగా తమకు మౌలిక సమస్యలు పరిష్కారం కావాలని, మానవాభివృద్ధికి చేరువలో జీవించాలని, అసమానతలు అంతరాలు ఈ దేశంలో ఉండకూడదని, రాజ్యాంగం కల్పించినటువంటి మేరకు సమాన అవకాశాలు అందరికీ అందుబాటులో ఉండాలని, వివక్షత అణచివేత ఉండకూడదని, హక్కుల కోసం ప్రశ్నించే పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలు ప్రజలు ప్రజాస్వామ్యవాదులు మేధావులకు ఉండాలని కోరుకోవడం మాత్రం నగ్నసత్యం. అయితే ఈ అభిప్రాయాలకు భిన్నంగా పాలకులు పనిచేస్తున్న మాట కూడా అంతే సత్యం". దానికి ప్రత్యక్ష ఉదాహరణగా ప్రస్తుతము జరుగుతున్నటువంటి ఎన్నికలు, ఎన్నికల్లో గెలుపోటములు, ఫలితాలను అంచనా వేసినప్పుడు బుద్ధిమంతులు విద్యావంతులు సమర్థులు గెలుపొందాలని మనం నిజంగా కోరుకుంటాం ఆ వైపుగా కొందరు బుద్ధివంతులు విద్యావంతులు ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు కానీ అలాంటివాళ్లు తమ మేధస్సును నిజాయితీని మాత్రమే నమ్ముకుని ఎన్నికల బరిలో దిగుతున్నారు కనుకనే ఓడిపోతున్నారు. వృత్తిరీత్యా ఉండేటువంటి తప్పుడు పనులు ఎన్ని ఉన్నప్పటికీ, నే ర చరిత్ర కలిగిన వారైనా అవినీతి అక్రమాలతో చట్టసభల్లోకి ప్రవేశిస్తున్నారు దొడ్డి దారిన అయినా అదే ప్రధాన రహదారి లాగా కనబడుతున్నది ప్రజలకు. ఈ రకమైనటువంటి వివక్షత, అసాధారణమైన రీతిలో కొనసాగుతున్నటువంటి తప్పుడు దొరణులకు చరమ గీతo పాడడానికి ప్రయత్నం ఎంత జరిగినా ఆ వైపుగా ప్రజల మద్దతును కూడగట్టలేకపోతున్నాం అనేది బాధాకరమైన విషయం .

     2025 ఫిబ్రవరి-- పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు :-

*******************************************

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం వరంగల్ నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ సంబంధించి ఉపాధ్యాయులు పట్టభద్రుల రెండు స్థానాలకు ఫిబ్రవరి 27వ తేదీన జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు 3 మార్చి 2025 రోజున లెక్కింపు ప్రారంభమైనది. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో చె ల్లని ఓట్ల మాదిరిగానే ఈసారి కూడా కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 28 వేలకు పైగా ఉపాధ్యా య స్థానానికి సుమారు 1000 చెల్లని ఓట్లు నమోదు అయినట్లుగా తెలుస్తున్నది. దాదాపుగా ప్రతి అభ్యర్థి తన మేనిఫెస్టోలో ఓటు వేసే విధానాన్ని స్పష్టంగా ప్రకటించడం జరిగినప్పటికీ పట్ట బదృలు, టీచర్లు కూడా ఓట్లు వేయడంలో పొరపాటు చేయడం అంటే సహించరా నటువంటి నేరంగా భావించవలసి ఉంటుంది. ఇదే సందర్భంలో ఒకటి రెండు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ గెలుపు కోసం పడరాని పాట్లు పడినట్లు వేలాది రూపాయలు పంపిణీ చేసి ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించినట్లుగా కథనాలు వెలబడుతున్నాయి. యూట్యూబ్ ఛానల్ లో అభ్యర్థులు తమ మద్దతు దారులను బెదిరించినట్లు కూడా ప్రకటనలు రావడాన్ని మనం గమనించవచ్చు. పట్టభద్రుల, ఉపాధ్యాయుల ద్వారా ఎన్నుకోబడే అభ్యర్థి విద్యారంగ పరిరక్షణ కోసం, ప్రభుత్వ రంగంలో విద్యను కొనసాగించడం కోసం, ప్రైవేటు విద్యను లేకుండా ఫీజుల బెడద లేకుండా ప్రభుత్వమే ఎంతటి విద్య కైనా ఉచిత నాణ్యమైన స్థాయిలో సౌకర్యాలు కల్పించే విధంగా ఒక నూతన వ్యవస్థను కోరుకోవడం, కామన్ స్కూల్ విధానాన్ని కూడా సాధించుకోవడానికి ఎమ్మెల్సీలు ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. ప్రభుత్వాల యొక్క మూర్ఖత్వాన్ని పక్కనపెట్టి విద్యావంతులు ఆ వైపుగా దృష్టి సారించి ప్రభుత్వం మెడలు వంచి ఒప్పించడానికి కృషి చేయడానికి గాను మనం ఎన్నుకునేటువంటి సభ్యులు ప్రధాన పాత్ర పోషించవలసి ఉంటుంది అంటే వాళ్లు నిజాయితీపరులు, వ్యక్తిత్వం గల వాళ్ళు, మానవీయ కోణంలో ఆలోచించగలిగిన వాళ్ళు, సమర్థులు కావలసినటువంటి అవసరం ఉంది. అలాంటి పరిస్థితిలో దానికి భిన్నంగా ఉపాధ్యాయులు కాని వాళ్లను ఉపాధ్యాయ ప్రతినిధిగా పోటీలో దింపడం, ప్రభుత్వ రంగాన్ని కాపాడవలసిన పరిస్థితిలో ప్రైవేటు విద్యాసంస్థల అధినేతను పోటీల్లో పెట్టడం, కొంతమంది ఉపాధ్యాయులు రియల్ ఎస్టేట్ ఇతర దందాలలో పనిచేస్తూ ఆటవిడుపు కోసం పోటీ చేయడం, మరి కొంతమంది ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం యొక్క ఆదరాభిమానాలు పొందడానికి పాదాభివందనం చేయడానికి మాత్రమే పరిమితమైనటువంటి కొన్ని సంఘాల పేర్లు చెప్పుకొని పోటీలో నిలబడడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇలాంటి పరిస్థితుల్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్థానము నుండి పోటీలో ఉన్నటువంటి వై అశోక్ కుమార్ గారు, ముత్తారం నరసింహస్వామి గారు ఇలాంటి మరి ఒకరిద్దరు కూడా పోరాటాలతో ఉద్యమాలతో ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంతో ప్రభుత్వ ఆద్వర్యంలో విద్య కొనసాగాలనేటువంటి ఆరాటంతో పనిచేసిన వాళ్లు ఈనాడు తెరచాటు కావదాన్ని గమనిస్తే ఓటు ఎవరికి దారా దత్తమవుతున్నదో అర్థం చేసుకోవచ్చు. ఉద్యమకారులకు రెండు మూడు వేలు మాత్రమే వస్తే గెలిచిన వారికి వేలల్లో ఓట్లు రావడం అంటే ఇది నిజంగా నిజాయితీ సమర్థతకు కట్టిన పట్టమేనా? ఈ క్రమంలో రాజకీయ పార్టీలు కొన్ని తమ ప్రాబల్యం పెంచుకోవడానికి ఉపాధ్యాయ పట్టభద్రుల స్థానాల లోపల కూడా చొరబడి మద్దతు ప్రకటించినట్లు చేసి నిజమైనటువంటి ఎమ్మెల్సీ యొక్క పాత్రకు భిన్నంగా వ్యక్తులను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం వాళ్ళని గెలిపించుకోవడం అంటే ప్రభుత్వమే నిబంధనలు ఉల్లంఘించడం కాదా? అలాంటి పరిస్థితిలో గెలిచిన వాళ్ళు ఏ రకంగా ప్రభుత్వ విద్యను ప్రోత్సహించగలుగుతారు? మరికొందరైతే పార్టీ కార్యక్రమాలతో సంబంధం లేకుండా ఒకేసారి తెర మీదకి వచ్చిన వాళ్లు కూడా పార్టీ పేరు చెప్పుకొని ఎన్నికల్లో నిలబడి గెలుపు అంచుకు చేరుకుంటున్నారు అని ఆ రాజకీయ పార్టీల కార్యకర్తలే వ్యాఖ్యానిస్తున్న సందర్భంలో నిజమైనటువంటి ప్రజల అభిప్రాయాలు ఇలాగే జీవితాంతం నిర్లక్ష్యం కావాల్సిందేనా? డబ్బు, పెట్టుబడి, ఆస్తులు, కులము, ఆధిపత్యం ఉన్నవాళ్లదేనా ఈ రాజ్యం, ఈ ఫలితాలు, ఎన్నికలు, ఈ ఓటర్ల తీర్పు? 

         ఇక ప్రధానంగా జరుగుతున్నటువంటి ఎన్నికల కౌంటింగ్ సరళిని పరిశీలించినటువంటి వ్యాఖ్యాతలు విశ్లేషకులు బిజెపి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటా పోటీలో ముందు వరుసలో ఉంటే మూడవ స్థానంలో ఉన్నటువంటి బీఎస్పీ బలపరిచిన అభ్యర్థి, స్వతంత్రంగా బీసీ వర్గాల మద్దతు, విద్యావంతులు మేధావుల యొక్క ప్రోత్సాహంతో బరిలో ఉన్నటువంటి ప్రసన్న హరికృష్ణ గారు శక్తి మేరకు పోరాడుతున్న సందర్భాన్ని గమనించి విశ్లేషకులు నైతిక విజయం ప్రసన్నదే అని చెప్పడాన్ని మనం అభినందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే పెద్దల సభ మేధావుల సభగా చెప్పుకునే "శాసనమండలికి ఎన్నిక అయ్యే సభ్యులందరూ కూడా బుద్ధి జీవులు మేధావులు నిపుణులు కావలసినటువంటి అవసరం ఉంది. కానీ అరకొర రాజకీయ పరిజ్ఞానం, డబ్బులు ఉన్నవాళ్లు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు పనికిరారు అనేది నగ్నసత్యం. అలాంటప్పుడు ఈ ఎన్నికల్లో పట్టబదృ లు ఈ రకమైనటువంటి పొరపాటును ఎందుకు చేసినట్లు? దీనికి కారణం ఏమిటి? డబ్బు ప్రాధాన్యతన? రాజకీయ పార్టీల ప్రాబల్యమా? లేదా ఓటర్ల యొక్క దౌర్భాల్యమా? ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఇక బిజెపి ఒక్క అడుగు ముందుకు వేస్తూ రాబోయే శాసనసభ ఎన్నికలు కూడా మేమే గెలుస్తాము అనే ధీమాలో తన హావ భావాన్ని ప్రకటిస్తున్నదంటే పరిస్థితులు ఎక్కడికి చేరుకున్నాయో అర్థం చేసుకోవచ్చు. అలాంటి పరిస్థితిలో ప్రజలు ప్రజాస్వామికవాదులు ప్రజాస్వామిక విలువలను రక్షించుకోవడానికి మరో పోరాటం చేయవలసి ఉంటుందేమో! పూర్వకాలంలో ఉన్నటువంటి రాజకీయాలు రాజ నీతిజ్ఞుల చేతిలో ఉంటే నేటి రాజకీయాలు విలువలు లేని ఆదిపత్యం డబ్బు అహంకారం చుట్టూ తిరుగుతూ ఉంటే సభ్యత సంస్కారం విజ్ఞానం మేధస్సు విద్య ఉన్నవాళ్లు చట్టసభల గడప దాటడం కష్టమేనా? దానికి పరిష్కారం లేదా? చట్టసభలు విజ్ఞులతో నిండకూడదా? విద్యార్థులు మేధావులు పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఆలోచించుకోవలసిన తరణం అసన్నమైనది.

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333