అభద్రతలో ఆకాశంలో సగం - మహిళల రక్షణ గౌరవం అందరి బాధ్యత.

Mar 8, 2025 - 11:13
 0  3

అభద్రతలో ఆకాశంలో సగం - మహిళల రక్షణ గౌరవం అందరి బాధ్యత.* దుండగుల దౌర్జన్యాలపై ప్రభుత్వాలు ఉక్కు పాదం మోపాలి- సమాజం సహకరించాలి.*

******************************************

---వడ్డేపల్లి మల్లేషము 9 0 1 4 2 0 6 4 1 2 

---18...02...2025*********************

పిల్లలు, కుటుంబ సభ్యుల పై పెట్టుకున్న ఆకాంక్షల నేపథ్యంలో బాధ్యతాయుతమైన వ్యక్తులుగా రూపొందించడానికి మహిళలదీ ప్రధాన పాత్ర కాగా కుటుంబంలో మహిళలు ఈ కీలక బాధ్యత పోషిస్తున్న విషయం కాదనలేని సత్యం. బాల్యం నుండి అమ్మాయిల పట్ల కొంత వివక్షత చూపుతున్న మాట వాస్తవం తల్లిదండ్రి కూడా బాలికలను అభద్రతకు గురి చేయడముతో పాటు మగవా రిని మాత్రమే కొన్ని పనులు చేయడంలో ప్రోత్సహించడం వంటి లక్షణాల వలన కూడా వారి పట్ల సమాజంలో చిన్నచూపు అంటే అతిషయోక్తి కాదు. వివక్షతకు దారితీసుకున్న విషయాన్ని కూడా కుటుంబాలు చిన్ననాటి నుండి చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. మారుతున్న కాలగమనం లోపల ఇటీవలి కాలంలో ముఖ్యంగా బాలికల రక్షణ గ o దరగోళంలో పడుతున్న నేపథ్యంలో ఆత్మ రక్షణ కోసం అన్ని రకాల విద్యలను నేర్చుకోవలసిన అవసరం ఉంది. బాలురతో పాటు బాలికలకు కూడా ఆ రకమైన శిక్షణ చిన్ననాటి నుండి ఇప్పించడంతోపాటు ఆత్మస్థైర్యాన్ని పెంచే పరిస్థితులను సమాజము తట్టుదండ్రులు పాఠశాల కల్పించవలసిన అవసరం కూడా చాలా ఉన్నది. అప్పుడు మాత్రమే వేధింపులు అత్యాచారాలు హత్యలకు మహిళ గురికాకుండా ఉంటుంది. అన్ని రంగాలలోనూ మగవారితో సమానంగా స్త్రీలు కూడా రాణిస్తున్న విషయo కాదనలేని సత్యం. అయినా మహిళలు అనేక రకాల దాడులకు గురికావడాన్ని తిప్పికొట్టడానికి ఉమ్మడిగా సమాజము పోలీసు వ్యవస్థ ప్రభుత్వం తీసుకునే కఠిన చర్యలతో పాటు ప్రభుత్వమే కొనసాగిస్తున్నటువంటి కొన్ని రకాల తప్పుడు, ప్రజావ్యతిరేఖ కార్యక్రమాలను రద్దు చేయగలిగితే ఇలాంటి దురాగతాలకు కొంతవరకు చరమగీతం పాడవచ్చు.

      ఆ చేష్టలు అమానుషం

******-****-----------------

-

  పెండ్లి చేసుకోలేదని అక్కస్తో పైశాచికంగా వ్యవ హ రించే సైకోలు యాసిడ్ దాడులకు పాల్పడడం, కత్తులతో పొడిచి హత్య చేయడం, అకృత్యాలు అత్యాచారాలకు పాల్పడడం, కాకుండా ప్రేమోన్ మాధుల వికృత చేష్టలకు తాలలేక బలవన్ మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య కూడా దేశంలో వేళల్లో ఉండడం ఆశామాశి వ్యవహారం కాదు. స్త్రీల అక్రమ రవాణా తో జాడ తెలియకుండా పోతున్న వారు కొందరైతే అనుమానాస్పద మృతి కారణంగా తల్లిదండ్రులకు దూరమవుతున్న ఆడబిడ్డల సంఖ్య అంతా ఇంతా కాదు. మహిళలపై వేధింపుల పర్వం కన్న తండ్రి నుండి మొదలు కొంటే ఇంటి పక్క వాళ్ళు, అవకాశవాదులు పనిచేసే ప్రతిచోట గుంటనక్కల్లాగా తొంగి చూస్తూ అవకాశాన్ని వినియోగించుకుంటున్న వారే ఎక్కువ. అది కూడా తెలిసిన కుటుంబాలే ఎక్కువ కావడం గమనించదగ్గ వ్యవహారం అని ఇటీవల కొన్ని పరిశోధనలు రుజువు చేసినాయి. పెళ్లికొప్పుకోవడం లేదని ఒక కారణమైతే అనుమానాస్పదంగా కాపురంలో కలతల కారణంగా మరికొందరు, తాగుడుకు బానిసై ఇంకొందరు ఏది ఏమైనా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించడం శారీరక మానసిక హింసకు గురి చేయడం ఈ లోకము నుండి పంపించి వేయడం అంతా మహిళలపై దాడులే కదా! గమ్మత్ ఏమిటంటే చట్టసభల్లో ఉన్న ప్రజాప్రతినిధుల పైన కూడా మహిళల పైన లైంగిక వేధింపుల కేసులు ఎక్కువగా ఉన్న ఈ దేశంలో ఇందుకు గల కారణాలను పాలకులు నిర్లక్ష్యం చేయడమే అని తెలుస్తున్నది.

  కొన్ని గణాంకాలు-- విషపరిణామాలు

****************************

ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2023-) 24 సర్వే ప్రకారంగా 177 దేశాలకు గాను భారతదేశ 128వ స్థానంలో మహిళల భద్రత నిలిచింది అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత అరాచకాలు అకృత్యాలు అత్యాచారాలు అవమానాలు స్త్రీలకు జరుగుతున్నాయో. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2014లో భారత దేశంలో మహిళల పైన నేరాలకు సంబంధించి 3.37 లక్షల కేసులు నమోదు కాగా ఎనిమిదేళ్ల అనంతరం అంటే 2022లో అవి 31 శాతం మేర అదనంగా పెరిగినట్లు తెలుస్తుంటే పాలకులు గానీ సమాజము గానీ తమ బాధ్యతను పూర్తిగా విస్మరించి మహిళల పట్ల దురుసుగా అనాగరికంగా ప్రవర్తిస్తున్నారని అర్థమవుతుంది కదా!

      మహిళలను ఈ రకంగా వివక్షతకు గురిచేయడానికి గల ప్రధానమైన కారణాలు మనందరికీ తెలుసు. మౌనంగా ఉండడం, అవసరాలు తీర్చుకోవడం వంటి అవకాశాల కోసం వేచి చూడడం, గుంట నక్కల వ్యవహరించడం పాలకులతో సహా వీలైతే మనమందరం కూడా అదే దొడ్డి దారిన నడుస్తున్నాము కనుక ఈ దుర్మార్గపు పోకడలు కొనసాగుతున్నాయి. వీటికి చరమగీతం పా డాలంటే, మహిళలు బలి పశువులు కాకుండా ఆత్మగౌరవంతో బ్రతికేలా చూడాలంటే మగ జాతికి సో యి తెచ్చి తమకు భార్యా పిల్లలు చెల్లెలు ఉన్నారని ఇంగిత జ్ఞానాన్ని మనం పదే పదే దృష్టికి తేవడం అవసరమేమో! తమ దాకా వస్తే కానీ తెలియనటువంటి దుర్మార్గపు పోకడలో కొనసాగుతున్న ఈ మానవ మృగాలకు చట్టపరంగా తగిన శిక్ష, అవకాశాలను నిషేధించడం, విద్యాసంస్థల్లో స్త్రీల పట్ల జరుగుతున్న వివక్షతను చిన్ననాటి నుండే రద్దు చేయడం, సోదర భావాన్ని కొనసాగించడానికి కామన్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టడం కూడా కీలకమైన అంశములు అని విజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. చాలా ప్రాంతాలలోనూ జరిగిన ప్రతి సంఘటనలోనూ ఆలోచిస్తే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల స్త్రీలు ఎక్కువగా దాడులకు గురవుతున్నటువంటి సందర్భాలను గమనించినప్పుడు ఇది ఒక పథకం ప్రకారం కొనసాగుతున్నదని అనుమానం రాక మానదు. కారణం చట్టాలు ప్రభుత్వాలు రాజకీయ పార్టీల అధికారాలు అన్నీ కూడా మెజారిటీగా ఆధిపత్య కులాల చేతుల్లో ఉండడం కూడా ఇoదుకు కారణమేమో! అందుకే నేరాలు చేసిన వాళ్లను ధృడ హస్తముతో అణచివేయాలి చట్టపరంగా ఉక్కు పాదం మోపాలి అంటే క్రింది కులాల వాళ్లు అధికారంలోకి రావాల్సిన అవసరం కూడా ఉంది. అప్పుడు మాత్రమే సరైన నేరస్తులకు తగిన శాస్తి జరుగుతుంది.

      మధ్యము, ధూమపానము, మత్తు పానీయాలు, ఇతరత్రా టీవీలు సినిమాల్లో స్త్రీలను అంగడి బొమ్మగా ఆట సరుకుగా మార్కెట్ వస్తువుగా ప్రవేశపెడుతున్నటువంటి పాలకుల పెట్టుబడిదారీ వర్గాల మాయాజాలాన్ని కూడా సమాంతరంగా దహనం చేయాలి. సామాజిక మాధ్యమాలలో మహిళలకు సంబంధించినటువంటి చిత్రాలు సన్నివేశాలు ప్రదర్శనలు వ్యాఖ్యానాలు మగ దురహంకారులకు ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని ఎంతకైనా తెగించే మూర్ఖత్వాన్ని పెంచి పోషిస్తున్న కారణంగా అలాంటి వాటిని కూడా నిషేధించడం ద్వారా మాత్రమే ఈ ఆగడాలకు అడ్డుకట్ట వేయవచ్చు. మహిళల భద్రతను సాధించవచ్చు అంటే ఇది సమాజంలోని భిన్న వర్గాల అందరి బాధ్యత కూడా అని తెలుసుకుంటే మంచిది. విలువలతో కూడినటువంటి విద్య, వికృత రూపాలకు తగిన శాస్తి జరిగినట్లు చూపే కళ రూపాలు, సమాజంలో స్త్రీల బాధ్యత కుటుంబాలలో వాళ్ళ పాత్ర పైన స్పష్టమైనటువంటి ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా కూడా కరకు గుండెల్లో బండరాతి మెదల్ల లో కూడా ఆర్డ్రత రాబట్టాలి. ఇక పాలకులు మాత్రం మౌనంగా ఉండి తమకేం సంబంధం లేదనుకుంటే అనేక సందర్భాలలో పాలకులు న్యాయవ్యవస్థ ఉన్నత స్థానాలలో ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో చిక్కిపోయినటువంటి సందర్భాలను గమనిస్తే కనీసం అప్పుడైనా ఆలోచన వస్తుందో ఏమో! రోజురోజుకు మహిళల పైన పెరుగుతున్నటువంటి కేసుల సంఖ్యను తగ్గించడం ద్వారా ప్రపంచంలో కూడా స్త్రీల భద్రతకు సంబంధించినటువంటి స్థానాన్ని మనం పది లపరుచుకోవాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియా తన దురాగతాన్ని కట్టడి చేయకపోతే ప్రభుత్వాలు ఇతర యంత్రాంగం లేదా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా దానికి తాగిన నివారణను కేంద్ర ప్రభుత్వం వెదకాలి అది చాలా కీలకమైన అంశం. పిల్లలు పెద్దలు కూతుర్లు కొడుకుల తో పాటు తల్లిదండ్రులు కూడా తమ నైతిక విలువలను కోల్పోతున్నటువంటి అరాచక అవకాశాలు చిత్రాలకు వేదికగా ఈనాడు సెల్ ఫోన్ వ్యవస్థ ఉన్నదనేది కీలక అంశమే కదా !

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడుఅరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333