ఎన్నికల్లో ఎస్సీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
హామీలు అమలు చేయాలంటూ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేత
కోదాడ, 10 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఎస్సీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డికి గురువారం తెలంగాణ ఎమ్మార్పీఎస్ నాయకులు వినతి పత్రాన్ని అందించారు. రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న మాదిగ ఆదేశాల మేరకు కోదాడలో ఎమ్మార్పీఎస్ నియోజకవర్గం ఇన్చార్జి బచ్చలకూరి నాగరాజు మాదిగ ఆధ్వర్యంలో కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు చింతాబాబు మాదిగ, జిల్లా అధ్యక్షులు పల్లెటి లక్ష్మణ్ మాదిగలు ఎమ్మెల్యేను కలిసి తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. చేవెళ్ల డిక్లరేషన్ లో పెట్టిన విధంగా ఎస్సీలకు అంబేద్కర్ ఆభయాసం పథకం కింద 12 లక్షల రూపాయలు అందివ్వాలని, అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ కు 15వేల కోట్ల రూపాయలు కేటాయించి అర్హులైన వారికి సబ్సిడీ రుణాలు అందించాలన్నారు. అసైన్డ్ భూములను అమ్ముకునే విధంగా హక్కు కల్పించడంతోపాటు పారిశుద్ధ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు కలకొండ ఆదినారాయణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి పోలంపల్లి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి బాణాల అబ్రహం, జిల్లా ఉపాధ్యక్షులు కందుకూరి నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి బొల్లె పోగు స్వామి, ఎం ఎస్ ఎఫ్ నాయకులు పిడమర్తి బాబురావు,తదితరులు పాల్గొన్నారు.