ఎండిపోయిన పొలాల రైతులను ఆదుకోవాలి

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ఎండిపోయిన పొలాల రైతులను ఆదుకోవాలి.. దండా వెంకటరెడ్డి తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి.... మండలంలో ఎస్సారెస్పీ నీళ్లు రాక ఎండిపోయిన పంట పొలాల రైతులను ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దండా వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈరోజు ఆత్మకూరు మండలంలోని నశింపేట గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భ జలాలు అడుగంటిపోయి ఎస్సారెస్పీ నీళ్లు రాకపోవడంతో రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సారఎస్పీ నీళ్ల ద్వారా చెరువులు కుంటలు నింపి భూగర్భ జలాలు ఉబికి వచ్చేలా చేయాల్సినవిదంగా అధికారులు చేయడం లేదని అన్నారు.పంటపొలాలు ఎండిపోవడంతో రైతులు అప్పుల పాలై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సారెస్పీ ద్వారా చివరి భూములకు నీళ్లు అందించడానికి ప్రభుత్వం తగిన విధంగా కృషి చేయడం లేదని తెలిపారు.నష్టపోయిన పంట పొలాలకు ఎకరానికి 25 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ అధికారులు గ్రామాలలో పర్యటనలు చేసి ఎండిపోతున్న పంట పొలాల రైతుల వివరాలు తెలుసుకోవాలని అన్నారు. రైతులను ఆదుకోకపోతే రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులను సమీకరించి ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు అవిరె అప్పయ్య రైతు సంఘం మండల కార్యదర్శి సోమిరెడ్డి దామోదర్ రెడ్డి ప్రజా సంఘాల నాయకులు సానబోయిన ఉపేందర్,ఎరుకల నాగరాజు, మూల విజయ్ రెడ్డి రైతులు ములకలపల్లి బుచ్చయ్య గుండాల లింగయ్య సురేష్ గంధం నరసయ్య గుండాల హనుమంతు వీరబోయిన రాములు తదితరులు పాల్గొన్నారు.