ఈదేశ కమ్యూనిస్టు పార్టీ సీపీఐ అగ్రనేత పోరాట యోధుడు సురవరం సుధాకర్ రెడ్డి మరణించడం బాధాకరం

ఆయన మరణం దేశానికి తీరని లోటు
సిపిఐ జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు.
గద్వాల నడిగడ్డ నాయకుడు అస్తమించిన ఎర్రని సూర్యుడికి నడిగడ్డ సిపిఐ నాయకులఘన నివాళులు, విప్లవ జోహార్లు.
జోగులాంబ గద్వాల 23 ఆగస్టు 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల జిల్లాలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో శనివారం నాడు ఆయన చిత్ర పటానికి నివాళులర్పించడం జరిగింది.ఈ సందర్భంగా CPI జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు మాట్లాడుతూ సురవరం సుధాకర్ రెడ్డి ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం అన్నారు.నేటి కమ్యూనిస్టులుగా మీ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం.ఈయన భారత కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ జాతీయ కార్యదర్శిగా 31-3-2012 నుండి 21-7-2019 వరకు పనిచేయడం జరిగిందన్నారు.కర్షకుల కార్మికుల & పీడిత ప్రజల బాగుకోసం కోసం ఎన్నో పోరాటాలు ఉద్యమాలు ఉదృతంగా చేసి తన జీవితాన్ని కూడ త్యాగం చేసిన ఘనత సురవరం సుధాకర్ రెడ్డి ది అన్నారు. 1942 మార్చి 25 కొండ్రావుపల్లి, మహబూబ్ నగర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ లో జన్మించి ఉన్నత విద్యనభ్యసించి,AISF విద్యార్థి నాయకుడి నుంచి, సిపిఐ జాతీయ నాయకుడు స్థాయిలో ఎదిగి,దాదాపు 8 భాషలు పైబడి అనర్గళంగా మాట్లాడే మహానుభావుడన్నారు. బి.ఏ ఉస్మానియా కళాశాల, కర్నూలు ఎల్.ఎల్.బి ఉస్మానియా విశ్వవిద్యాలయం లా కళాశాల, హైదరాబాద్. AISF ఆల్ ఇండియన్ స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థి సమాఖ్య నాయకుడిగా 1960 సంవత్సరం డిగ్రీ చదివే విద్యా సంవత్సరం నుండి విద్యారంగంలోని సమస్యలను పరిష్కారం చేసేందుకు తనవంతుగా విద్యార్థి నాయకుడిగా ఎంతో గట్టి పట్టుదలతో కృషి చేశాడు. హైదరాబాద్ జనరల్ సెక్రెటరీ గాను. నేషనల్ కౌన్సిల్ గాను, ఏఐవైఎఫ్ (AIYF) వైస్ ప్రెసిడెంట్ ఏపీ స్టేట్ కౌన్సిల్ గాను ఎంతో సేవ చేశారన్నారు. 1998లో 12వ లోక్ సభ స్థానానికి మొదటిసారి ఎన్నికయ్యారనీ,అలాగే భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) రాష్ట్ర మండలి, ఆంధ్రప్రదేశ సభ్యులు, సలహా కార్యవర్గ సమితి, ఆర్థిక మంత్రిత్వ శాఖ. 2004లో 14వ లోక్ సభ స్థానానికి రెండవసారి ఎన్నికయ్యారనీ అన్నారు.