ఇటిక్యాల తహసీల్దార్ పై దాడి హేయమైన చర్య.
దాడి చేసిన వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ పివోఎ కేసు నమోదు చేయాలి.

బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ఆకేపోగు రాంబాబు
జోగులాంబ :(ఇటిక్యాల):- ఇటిక్యాల మండల తహసీల్దార్ పై దాడికి పాల్పాడటం హేయమైన చర్య అని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకేపోగు రాంబాబు అన్నారు. శనివారం ఆయన ఇటిక్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నాయకులతో కలిసి మాట్లాడారు. ఒక మండల మేజిస్ట్రేట్ అయిన మండల తహసీల్దార్ పై దాడి చేయడంతో పాటు కార్యాలయంలో కొన్ని కిలక పత్రాలను విసిరి వేయడం అనగరిక చర్య అని అన్నారు.మునుగాల గ్రామ పంచాయితీకి చెందిన పారిశుధ్య కార్మికులను తొలగించాలని గ్రామానికి చెందిన కొంతమంది తహసీల్దార్ ను అడుగగా విచారణ చేస్తామని చెప్పినప్పటికి దాడి చేయడం నియంతృత్వమని అన్నారు.దాడికి పాల్పడిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఎస్సీ, ఎస్టీ పీవోఎ కేసులు నమోదు చేసి రిమాండ్ చేయాలన్నారు. ఇది రాష్ట్రంలో ఉన్న ప్రజాపాలన కాదని నియంతృత్వ పాలన అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారులపైనే దాడులు జరుగుతున్నయంటే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.దాడికి పాల్పడిన వ్యక్తులు ఎంతటి వారైన వదిలి పెట్టకూడదని అన్నారు.దాడి చేసిన వారిని వదిలి పెడితే భవిష్యత్ లో ఇతర అధికారులపై కూడా దాడికి పాల్పాడే అవకాశం ఉందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో కేవలం ఎస్సీ, ఎస్టీ అధికారులపైనే దాడులు ఎక్కువ జరుగుతుండటం శోచనీయం అన్నారు.దాడి జరిగి 24గంటలైన నేటికీ దాడి చేసిన వ్యక్తులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని అన్నారు.తక్షణమే అధికారులు స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.దాడి జరిగింది.లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని అన్నారు. ప్రభుత్వ అధికారులను బహుజన్ సమాజ్ పార్టీ అండగా ఉటుందని అన్నారు.ఆయన వెంట జిల్లా ఉపాధ్యక్షులు జీ. మణి కుమార్ ఇతతులు ఉన్నారు.
పై విషయంపై ఇటిక్యాల ఎమ్మార్వో నీ తెలంగాణ వార్త రిపోర్టర్ గా వివరణ కోరగా నేను ఇటిక్యాల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది కానీ ఎస్సై స్పందించడం లేదని ఎమ్మార్వో తెలిపారు.
ఇటిక్యాల ఎస్సైని తెలంగాణ వార్త రిపోర్టర్ గా డిపార్ట్మెంట్ సిమ్ నంబర్ కి ఫోన్ చేయగా ఆయన స్పందించడం లేదు? మరియు మెసేజ్ చేయడం కూడా జరిగింది. అయినా కూడా ఆయన స్పందించడం లేదు?.