రైతు రుణమాఫీ చారిత్రాత్మకం
రైతు రుణమాఫీలో అగ్ర గ్రామిగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం
సాగు చేసే ప్రతి రైతన్నకు రైతు భరోసా
ఎన్నికల హామీలో ఇచ్చినట్లుగానే ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేసి రైతు పక్షాన పని చేసే ప్రభుత్వంగా తెలంగాణ రాష్ట్రం దేశ చరిత్రలోనే నిలిచిపోయిందని వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు పేర్కొన్నారు
శనివారం ఖిల్లా ఘనపురం మండల తాసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు
ఖిల్లా గణపురం మండల పరిధిలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు కావలసిన చర్యలు చేపట్టి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ఆయన పేర్కొన్నారు
కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, వనపర్తి మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ఖిల్లా ఘనపురం మాజీ ఎంపీపీ క్యామా వెంకటయ్య, మండల నాయకులు సాయి చరణ్ రెడ్డి, వనపర్తి మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, వెంకట్రావు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రాములు, కృష్ణయ్య, విజయ్ కుమార్, డీలర్ రమేష్, కృష్ణారెడ్డి, ప్రకాష్, రవి, లక్ష్మారెడ్డి, వెంకట్రెడ్డి, నరేందర్ రెడ్డి, మనిగిళ్ల తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీటీసీ విజయలక్ష్మి, ఓమేష్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
ద్యారపోగు వెంకటేష్
టిపిసిసి కాంగ్రెస్ పార్టీ వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్