ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో ఎమ్మార్వో కు వినతి పత్రం

చిన్నంబావి మండల పరిసరంలో ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మార్వో కు సిఐటియు ఆధ్వర్యంలో వినతిపత్రం.
17-03-2025 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.:- తాసిల్దార్ కార్యాలయం ముందు ఆశా వర్కర్ల ధర్న వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం తాసిల్దార్ కార్యాలయం ముందు ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ధర్నా ఉద్దేశించి సీఐటీయూ మండల కన్వీనర్ ఎం వెంకటేష్ మాట్లాడుతూ. ఆశా వర్కర్లకి ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రకటించినటువంటి హామీలను వెంటనే అమలు పరచాలని ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని ఈ సందర్భంగా వారి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో రాధా, రామచంద్రమ్మ,యశోద భాయ్, కృష్ణవేణి, తదితర ఆశ వర్కర్లు పాల్గొన్నారు.