•    ఆపరేషన్ ముష్కాన్ -X బృందం దాడులలో 18 మంది చిన్నారులకు విముక్తి

Aug 2, 2024 - 18:01
Aug 2, 2024 - 18:09
 0  5
•    ఆపరేషన్ ముష్కాన్ -X బృందం దాడులలో 18 మంది చిన్నారులకు విముక్తి

18 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకుని వారితో పని చేయిస్తున్న వారిపై  చట్ట ప్రకారం చర్యలు

జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు,
     
జోగులాంబ గద్వాల 2 ఆగస్టు 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- సమాజంలోని బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు  సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ అనే కార్యక్రమాలను నిర్వహించి తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చేలా, వెట్టి చాకిరి చేస్తున్న చిన్నారులను గుర్తించి విముక్తి కలిగించేలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్-X విజయవంతం అయిందని జిల్లా ఎస్పీ శ్రీ టి.శ్రీనివాస రావు,IPS . తెలిపారు.

 చిన్నారులకు విముక్తి కల్పించడం కోసం పోలీస్ శాఖ,చైల్డ్ వెల్ఫేర్ కమిటీ,లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, వివిధ డిపార్ట్మెంటు అధికారులతో జిల్లాలో టీమ్ లుగా ఏర్పాటు చేసి ప్రభుత్వేతర స్వచ్చంద సంస్థల సహకారంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందని, ఈ సంవత్సరం జులై 1 నుండి 31 వరకు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్  కార్యక్రమాలో జిల్లా వ్యాప్తంగా 18( బాలలు -11, బాలికలు-7) మంది  చిన్నారులను గుర్తించి వారి యొక్క తల్లిదండ్రుల వద్దకు చేర్చడం జరిగిందని అందులో 11 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేయడం జరిగిందనీ,  ముగ్గురు ఓనర్ లకు లేబర్ డిపార్ట్మెంట్ వారు జరిమానాలు విధించడం జరిగిందనీ అన్నారు. విముక్తి పొందిన చిన్నారులు తిరిగి చదువుకునేల చైల్డ్ డిపార్ట్మెంట్ వారు కృషి చేయడం జరుగుతుందని ఎస్పీ  తెలిపారు.

 బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మానందరిపైనా ఉన్నదని,బాల కార్మిక వ్యవస్థ నిర్ములన కోసం బాధ్యతాయుతంగా కృషి  చేయాలని కోరారు.తరుచు బాలల చేత పనులు చేయిస్తున్న వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.వీధి బాలలను, బాల కార్మికులను చూసినప్పుడు, డయల్- 100 లేదా 1098 లేదా స్థానిక పోలీస్ వారికి సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ  ప్రజలకు సూచించారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State