ఆదివాసి కి 50 కేజీల బియ్యం వితరణ అందజేసిన పూర్వ విద్యార్థులు

చర్ల, ఫిబ్రవరి 16 : వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్ది నిలయం విద్యార్దులకు చర్ల మండలం కేశవాపురం గ్రామస్తులు తుర్రం ఆదినారాయణ 50 కేజీల బియ్యం, కూరగాయలు, అరటిపండ్లు, స్వీట్స్ అందచేసారు. తన సోదరుడు, శ్రీరామ విద్యానిలయం పూర్వ విద్యార్ది తుర్రం శేషుబాబు వివాహం సందర్భంగా వితరణ అందచేసారు. ఆదివారం విద్యార్ది నిలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో వనవాసీ కళ్యాణ పరిషత్ ప్రఖండ ప్రముఖ్ గొంది శోభన్ బాబుకు వితరణలను అందచేసారు. ఈ సందర్భంగా శోభన్‌బాబు మాట్లాడుతూ సంస్దకు చెందిన బాగ్యనగర్ పూర్వ విద్యార్థులు తమ రుణం తీర్చుకునేందుకు వితరణ అందచేయడం అబినందనీయమన్నారు. గిరిజన విద్యార్దుల అభ్యన్నతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. పూర్వ విద్యార్దుల వితరణ పట్ల విద్యార్ది నిలయ కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేసారు. కార్యక్రమంలో మల్లెల అభిలాష్, సోడి రాంబాబు, వగ్గిల రాజ్ కుమార్, మోసం రాంబాబు, ఉయిక సంపత్ కుమార్, బందం నవీన్, కృష్ణ సాగర్, వంక పూర్ణచందు, తుర్రం శేషు, శివుడు పాల్గొన్నారు.