కష్టాలు తీర్చే దేవుడికే కష్టం వచ్చింది

మాది సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ గ్రామం
నా పేరు: శ్రీ శ్రీ శ్రీ శాల్మలి కంద శ్రీ ఆది వరాహ లక్ష్మీనరసింహ వేణుగోపాల్
మేము అనగా శ్రీ శ్రీ శ్రీ శాల్మలి కంద శ్రీ ఆదివరాహ లక్ష్మీనరసింహ వేణుగోపాలస్వామి.
ఈ ఊరి దేవస్థానం లో మాకు ఒక గూడు ఏర్పాటు చేసి మాతో పాటుగా ఆళ్వారాదులను 24 అడుగుల అనంత పద్మనాభ స్వామిని అదేవిధంగా ఈ గ్రామంలో ముక్కోటి దేవతలు కొలువై ఉన్న స్థలముగా బురుగుమాన పట్టణముగా పేరుగాంచినది.
ఈ పేరు ఏలా వచ్చిందీ
పూర్వం దేశ సంచారం చేసుకుంటూ భృగుమహర్షి బృగు చెట్టు కింద సదాతీరుతూ తపస్సుబూని అలానే నిమగ్నం అయిపోయాడు ఆ మహర్షి అందువలన బూరుగుమాన పట్టణంగా కాలక్రమేపి బూరుగడ్డగా మారింది.
ఆహ్లాదకరముగా మేము పచ్చని పంట పొలాల నడుమ పకృతి సోయగాలను ఆస్వాదిస్తూ కోకిలమ్మ కిలకిల రాగాలు చేప పిల్లల సవ్వలు వినుకుంటూ ఉన్నాము.
ఈ దేవాలయ ప్రతిష్టాపన ఎప్పుడు జరిగింది
1190. విభవ జ్యేష్ట శుద్ధ దశమి గురువారం రోజున సకల జనహితార్ధముగా లోకం మొత్తం సుభిక్షంగా ఉండాలని బురుగుగడ్డ గ్రామమున ప్రతిష్ట గావించినారు
11. వ శతాబ్దపు కాలంలో ఆనాడు కాకతీయ రాజులు వారి స్వాహాస్తలతో ఒక గూడును రాతితో నిర్మించి మమ్ములను అందులో ప్రతిష్టించి భక్తుల పూజలు అందుకునే విధంగా మమ్ములను నెలకొల్పారు.
ఆనాడు పెద్దలు కాకతీయ రాజులు ఈ గ్రామంలో గుడి కట్టించి ముక్కోటి దేవతలను నెలకొల్పారు.
ముందు భవిష్యత్ తరాలకు దేవాలయమునకు నిత్య ధూప దీప నైవేద్యాలకు స్వామి వార్ల కైంకర్యాల నిమిత్తం ప్రమాదం వాటిల్లకుండా మాకు భూదానం గోదానం చేశారు.
పూర్వం నేను 1200 ఎకరాల భూస్వామి కానీ మధ్యలో పటేల్ పట్వారి పెత్తనం వాచ్చాక
అప్పుడు పెత్తనం చెలాయించినటువంటి పెత్తనదారులు వారికి ఇష్టం వచ్చినట్టుగా వారిపై పట్టాలు చేసుకుని నేటికీ అనుభవిస్తున్నారు.
మేము శిలా రూపంలో ఉండడమేనా మేం చేసుకున్న పాపం.
అంటే మేము మాట్లాడలేమని ఎవరితో పోట్లాడలేమనా వారి యొక్క ధీమా❓
అది నిజమే కావచ్చు కానీ మళ్లీ మా దగ్గరకు వచ్చి గుడి చుట్టూ తిరిగి కొత్త కొత్త వేషాలు వేసుకుంటూ మాకు దండం పెడుతూ మొక్కులు మొక్కుకుంటూ కలిసి రావాలి మాకు కలసి రావాలి కోట్లను కొల్లగొట్టాలి అని పెద్ద పెద్ద మొక్కులు మొక్కుతూ మా దగ్గరకు వచ్చి ఈ కోరిక తీరిస్తే మీకు ఇది చేపిస్తాము అది చేపిస్తాము అని మా తోనే ఆటలాడుతుంటారు ఈ భక్తులు. మరి భక్తుల
కోరికలు తీరుస్తారు అనే నమ్మకం ఉన్నప్పుడు భగవంతుడు భూమి ఆక్రమించుకొని కొంతమంది పట్టాలు చేసుకుని కౌవులుకి ఇచ్చిన భూములను కౌవులు కట్టకుండా ప్రతివాడు రాజకీయం చేస్తూ మా కడుపు కొడుతున్నారే అప్పుడు ఏమైంది మా మీద మీకు ఉన్న నమ్మకం❓
అంటే ఏమి కాదులే వాళ్ళు ఏం చేయలేరనేనా మీ ధీమా ❓
మీరు కొలిచేటువంటి భగవంతుడి నోరు కొట్టినవాడు చరిత్రలో నిలిచి లేడు అనేది గుర్తుపెట్టుకోవాలి
ఒకవేళ ఉన్న ఆరోగ్య సమస్యలతో సతమౌతమవుతున్న వారే ఉంటారు అది గమనించాలి.
ప్రతిరోజు మా ఆండా తల్లి అంటూఉంటది. కృష్ణయ్య కృష్ణయ్య ఎందుకింత తపన పడుతున్నావు ఎందుకింత మదన పడుతున్నావు కృష్ణయ్య పోయిన భూమి మనకు ఎలా వస్తుంది ఉన్న భూమిని కాపాడుకుంటే చాలు కదా అని అంటుంది ఆండాళ్ తల్లి
నేను అంటాను మా ఆండాళ్ తల్లి ఆ ఉన్న భూమి కూడా ఎంత ఉంది సేద్యం ఎంతవరకు అనేది కూడా మనకు క్లారిటీ లేకుండా ఉంది
గవర్నమెంట్ వారి లెక్కల ప్రకారం వారికి ఒక లెక్క ఉంది కానీ మనభూమి మనకు లెక్క ఉండాలి అనేది నా ప్రశ్న...❓❓❓
గోపాలును పేరు మీదగా గోపాలపురం గ్రామము ఏర్పడింది.
గోపాలపురం పారుగాడికి ముందు భవిష్యత్ తరాలకోసం ముందు చూపుతో అనాడు చెరువులు తవ్వించి ఉంచారు కాకతీయులు.
నేటికీ ఆ ప్రాంతం ధాన్యరాశులతో సిరిసంపదతో తులతుగుతుంది.
నా భూమి మొత్తం కూడా గోపాలపురం హుజూర్నగర్ గ్రామ వాస్తవ్యుల ఆధీనంలో ఉంది.
ఈ గ్రామంలో కూడా కొంత పట్టా భూములు ఉన్నాయి. వీళ్లకు పట్టాలు ఎక్కడ నుంచి వచ్చాయి ఎవరు చేశారు ఈ రైతుల దగ్గర నుండి లింక్ డాక్యుమెంట్స్ సేకరించి వీటిపై పూర్తిగా సర్వే చేసి ఆ పట్టాలపై విశ్లేషించి నా భూమిని నాకు దక్కే విధముగా సంబంధిత కలెక్టర్ గారిని వేడుకుంటున్నాము.
నా పొలాల కౌలు సంగతేంటి* ❓❓❓
నా కౌలుదారుల ఇంటికి వెళ్లి నేను కౌలు అడిగితే నాకు ఏదో బిచ్చం వేసినట్టు నన్ను నాన్న రకాలుగా తిట్టుకుంటూ గులుగుకుంటూ అడగంగా అడగంగా అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని నా ముఖాన వేస్తున్నారు వాళ్లు మాత్రం పంట పండించుకుని మూడు పూటలు తింటున్నారు మమ్ములను పస్తులుంచుతున్నారు
మీరు ఉండే ఇంటి కిరాయి కూడా నేను అడగడం లేదు
మీరు నివసించే భూమి కూడా నాదే కథ
గ్రామపంచాయతీ కార్యదర్శి కూడా కొంతమందికి ఇండ్ల పట్టాలు చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు వాళ్ళకి నా భూమిపై ఎలాంటి రైట్స్ ఉన్నాయి దేవాలయ భూములను వారికి ఎలా పట్టా చేస్తారు నాకు నా భూమికి రక్షణ కల్పించాల్సిన వారే ఇలా చేస్తే ఎలా సంబంధిత అధికారులు వారిపై విచారణ చేపట్టి తక్షణమే చర్యలు తీసుకోకపోతే నా భూమి నా చేయి తగ్గేలాగా లేదని మేము అధికారులను మొరపెట్టుకుంటున్నాం.
పచ్చని పొలాలలో వెచ్చని మంటలు
మేము మీకు పంట పండించుకొని మీ కడుపు నింపుకుంటూ
మా కడుపు నింపమని పంట పండించుకోమని కౌలుకు ఇచ్చాము కానీ ఇటుక బట్టీలు పెట్టి మీరు కోట్లు సంపాదించుకుంటున్నారు మాకు మా పొట్ట కూటికి నాలుగు రూపాయలు ఇవ్వమంటే ఇవ్వకుండా నా నరకాలుగా ఇబ్బందులు పేడుతున్నారు
రెవెన్యూ అధికారులు సైతం వీరి దగ్గర లంచాలు తీసుకుంటూ వాళ్ళ కడుపు వాళ్ళలు నింపుకుంటున్నారు
మా భూముల పేరు చెప్పుకొని నాయకుల నాలుకకు ఆకాశమే హద్దుగా వాళ్లు నాకుతున్నారు.
ఇటు నాయకులు అటు రెవెన్యూ అధికారులు కలసి మా పచ్చని పొలాలలో వెచ్చని మంటలు ఆర్పకుండా వాళ్లు చోద్యం చూస్తున్నారు మేము కన్ను వెర్ర చేస్తే ఏది ఏమైనా జరగొచ్చు అనేది మర్చిపోతున్నారు.
గతంలో ఇటుక బట్టీల పేరు చెప్పుకొని ఆ ఇటుక బట్టీలను ముపించకుండా లక్షలలో డబ్బులు తీసుకున్న వ్యక్తి ఈరోజు జైలు పాలయ్యారానే *నిజాన్ని* మీ ముందు ఉంచుతున్నాను ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ సంబంధిత దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ స్పందించి నా పంట పొలాలలో బోర్డులను ఏర్పాటు చేసి నా భూమికి రక్షణ కల్పించాలని అధికారులను వేడుకుంటున్నాము.
గతంలో అధికారులు ఏర్పాటు చేసిన బోర్డులను ఆ రైతులు తొలగించి పాత ఇనుము కింద అమ్ముకుంటున్నారు.
ఇలాంటి రైతులపై కఠినమైన చర్యలు తీసుకోకపోతే దేవాలయ భూములకు చాలా పెద్ద ప్రమాదం వాటిల్లుతుంది.
నా పంట పొలాలలో వెచ్చని మంటలు ఆర్పకపోతే భూమిలో భూసారం తగ్గి భూమి పంట వేయడానికి పనికి రాకుండా పోయే ప్రమాదం ఏర్పడుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలిపారు.
నా పచ్చని పంట పొలాల్లో ఈ వెచ్చని మంటలని ఆపుతారో లేక ఇలానే కొనసాగిస్తారో వేచి చూడాలి.
అయ్యా❗
మేము మీరు చూడ్డానికి శిలా రూపంలో ఉన్న విగ్రహాలం.
విగ్రహాలు ఉగ్రరూహం దాలిస్తే ఎలా ఉంటదో మీకు తెలుసు పకృతిలో పంచభూతాలు ఎప్పుడు ఎక్కడ ఏ పని చేయాలో బాగా తెలుసు
ఇటు దేవాలయ భూములకు అటు దేవాలయానికి రక్షణే కరువై కనుమరుగయ్య రోజు దాపరించేటట్లుంది
పూర్వం రోజుల్లో దేవాలయం దేదీప్యమానంగా మూడు పూలు ఆరుకాయలుగా వర్ధిల్లి రెండు రాష్ట్రాల నుంచి ఈ బూరుగడ్డకు భక్తులు ఎడ్ల బండ్లు కట్టుకొని దారి పొడవునా వస్తుంటే
బూరుగడ్డ జాతర సురువైంది అనుకోని పల్లె పల్లెలో ఆడపిల్లను పిలుచుకొని ఇంటికి సున్నాలు వేసుకొని ఇల్లు అల్లుకొని ముగ్గులు పెట్టుకుని కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా నా కళ్యాణం అంత గొప్పగా జరిగేది ఆనాడే బూరుగడ్డ జాతర పేరెన్నికైన జాతరగా పేరొందింది. నేడు నా కళ్యాణం జరుగుతుంటే మేమే కన్నీళ్ళపర్వతంమై పోవలసి వస్తుంది
కళ్యాణం ఎదుర్కొల్లు జరిగే సమయంలో భక్తులు లేక నా దేవాలయం విలవిలలాడిపోతోంది గతంలో నా పరిసర ప్రాంతాలలో ఎంత కోలాహారంగా కన్నుల పండుగ లైట్ బుగ్గల నడుమ మేము పరవశించిపోయేది మా కళ్యాణం ఇంతకీ దిగజారుతుందని మేము ఎప్పుడు కూడా కలగనలేదు
బూరుగడ్డలో మేము సకుటుంబ సపరివారంగా అందరం కలిసి మెలిసి ఉంటున్నాం కానీ మా జీవన ప్రయాణం అంటే ధూప దీప నైవేద్యములకు ప్రతి సంవత్సరం జరిగే జాతర ఉత్సవాలకు కొంచెం కష్టంగా ఉన్నదని మొరపెట్టుకుంటున్నాము.
*అయ్యా* ❗
*ఉదాహరణకు మా కుటుంబ ఖర్చులు చెబుతాము*
దేవాలయానికి వచ్చేవారిని పోయే వారిని ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులు ఒక పదవిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు వస్తారు వారికి మేము ఎప్పటిలాగే వారిని మర్యాదపూర్వకంగా గౌరవిస్తూ వారికి నుదుటన బొట్టు పెట్టి వారికి ఒక చక్కటి శాలువా కప్పి మెడలో లిల్లీ పూల దండవేసి మాకు కలిగింది తోచింది కొంత ప్రసాదం పెట్టి ప్రతి వారిని గౌరవిస్తూ వస్తున్నాము ఎవరికి ఏమి తక్కువ చేయకుండా తక్కువ చేస్తే మళ్లీ ఇక్కడ ఒప్పుకోరు కదా అందుకే ప్రతి ఒక్కరిని మర్యాదపూర్వంతో గౌరవిస్తూ సమాజంతో పాటు నడుస్తున్నాము అందులో మా సేవకులు మా పని వారికి జీతభత్యాలు సకాలంలో ఇవ్వలేక ఇవన్నీ నడపాలంటే మాకు కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. సకాలంలో కౌలుదారులు కౌలు చెల్లించి కౌలుదారులు రాజకీయ నాయకులు సంబంధిత ఉన్నతాధికారులు మాపై చొరవ తీసుకొని మాకు న్యాయం చేకూరేలాగా పూర్వపు రోజుల్లో మా కళ్యాణం ఎలా జరిగిందో మళ్లీ పూర్వ వైభవాలు తీసుకురావాలని సకల భక్తకోటిని వేడుకుంటున్నాము
*ఇట్లు*
*శ్రీశ్రీశ్రీ శాల్మలి కంద ఆది వరాహ లక్ష్మీనరసింహ వేణుగోపాల స్వామి దేవస్థానం బూరుగడ్డ*
*హుజూర్నగర్ మండలం సూర్యాపేట జిల్లా*
????????????????????????