ఆత్మీయ రాఖీ పౌర్ణమి
సోదార భావాన్ని పరస్పర రక్షణ పెంపొందించేందుకు రాఖీ పండుగ ప్రతికగా నిలుస్తుంది
ములుగు జిల్లా, ఆగస్టు :28:- ములుగు జిల్లాలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు వారి వారి కార్యకర్తల అక్కచెల్లెళ్లతో రోజంతా రాఖీ పండుగ వేడుకలలో ఉన్నారు. ములుగు నియోజకవర్గం బి.ఆర్.ఎస్ పార్టీ ఇన్చార్జి రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని బీఆర్‌ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు శ్రీ కాకులమర్రి లక్ష్మణ్ బాబు కి బీ ఆర్ ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ మాజీ జడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి ఆత్మీయంగా సోదర భావాన్ని పరస్పర రక్షణ భావనను పెంపొందించేందుకు రాఖీ పండుగగా ప్రతి కగా నిలుస్తుంది.అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ సందర్భంగా లక్ష్మణ్ బాబుకి రాఖీ కట్టి ఆయన ఆశీస్సులు బడే నాగజ్యోతి అందుకున్నారు.లక్ష్మణ్ బాబు వారి సతీమణి ఏటూరునాగారం సర్పంచ్ శ్రీలత బడే నాగజ్యోతికి ఆత్మీయంగా ఆశీస్సులు అందజేసి సోదర ప్రేమకు ప్రతీకగా చీరను అందించి ఆశీర్వదించారు.రాఖీ పండుగ సందర్భంగా పరస్పరం ప్రేమాభిమానాలు ఆత్మీయతను పంచుకుంటూ అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.