ఆటో.. ఇటో.. అయితే ప్రాణాలకే ముప్పు

బస్సు లేకపోవడంతో ప్రమాదకర ప్రయాణం..
విద్యార్థులు ఆటోల్లో కిక్కిరిసి పాఠశాలకు చేరుతున్నారు....
ఆటో ఎక్కాల్సిందే.. ఉన్నది ఒక్కటే బస్సు...
ఆర్టీసీ బస్సు సదుపాయం లేక విద్యార్థుల అవస్థలు..!
దాదాపు 5 నుండి 8 కిలోమీటర్లు ప్రయాణం
తిరుమలగిరి 30 జూన్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని ఓ ఆటో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకొని ప్రయాణిస్తూ కనిపించింది చిన్నారులను ఆటోలో కుక్కేసి తీసుకెళుతున్నట్లు ఉన్న దృశ్యాన్ని చూసి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇలా ఆటోలో వెనక కూర్చోబెట్టి తీసుకెళ్లడం ప్రమాదకరమని, రవాణా శాఖ అధికారులు ఇలాంటి ఆటో డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు.సైకిళ్లు,ఆటో,ప్రైవేట్ వాహనాలే దిక్కు విద్యార్థుల భద్రత కోసం,ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించాలని,సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించకూడదని,వేగంగా నడపకూడదని,కొన్ని నిబంధనల ప్రకారం ఆటోలలో అనుమతించదగిన దానికంటే ఎక్కువ మంది విద్యార్థులను ఎక్కిస్తున్నారు.చిన్న ఆటోలలో నలుగురు లేదా ఆరుగురు మాత్రమే ప్రయాణించాల్సి ఉండగా,15 నుండి 20 మంది విద్యార్థులను ఎక్కిస్తున్నారు. అలాగే, అతివేగంగా నడపడం,రోడ్లపై సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటివి కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. విద్యార్థులను స్కూల్స్ కు తీసుకెళ్లే సమయంలో ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించడం లేదు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి మోడల్ స్కూల్ విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సు సౌకర్యాలను కల్పించాలని విద్యార్థులు తల్లిదండ్రులు వేడుకుంటున్నారు....