ఆజాద్ యూత్ ఆధ్వర్యంలో ఆట దుస్తుల పంపిణీ

Jan 23, 2026 - 21:08
 0  1
ఆజాద్ యూత్ ఆధ్వర్యంలో ఆట దుస్తుల పంపిణీ

  తిరుమలగిరి 24 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

 తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో మండల ప్రాథమిక పాఠశాల బీసీ కాలనీ పిల్లలకు ఆజాద్ యూత్ వారు 15 వేల రూపాయల విలువగల స్పోర్ట్స్ డ్రెస్ పిల్లలకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆజాద్ యూత్ అధ్యక్షులు చాపల సురేష్ రెడ్డి, ముత్యాల రమేష్, పోరెల్ల వెంకన్న, నిమ్మల నాగరాజు,వేల్పుల మహేందర్ లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉభయ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఆజాద్ యూత్ వారు చేసే సామాజిక సేవలు వెలకట్టలేమని, వారి సేవలు ముందు ముందు పాఠశాలకు మరెన్నో చేయాలని, యువతకు ఆదర్శంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సైదులు, ఉన్నత పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి