అలంపూర్ మార్కెట్ కమిటీ జీవో విడుదల
మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉప్పరి దొడ్డప్ప మరియు వైస్ చైర్మన్ గా పచ్చర్ల కుమార్ .
జోగులాంబ గద్వాల 5 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- అలంపూర్. మార్కెట్ కమిటీ జీవో పత్రాన్ని ఈరోజు ఐసిసిసి కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే డా.SA సంపత్ కుమార్ చేతుల మీదుగా కమిటీ చైర్మన్ దొడ్డప్ప మరియు వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్ అందుకోవడం జరిగింది. హైదరాబాదులోని సంపత్ కుమార్ నివాసంలో జీవో పత్రాన్ని అందుకున్న అనంతరం సంపత్ కుమార్ కి శాలువాతో సత్కరించి మిఠాయి తినిపించి కృతజ్ఞతలు తెలియజేసిన చైర్మన్ మరియు వైస్ చైర్మన్ .
ఈ సందర్భంగా వారికి ఈ అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.