అలంపూర్ ఏపీఎం మార్థమ్మ, సిసి జయమ్మ పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి.CITU డిమాండ్

జోగులాంబ గద్వాల 9 అక్టోబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : అలంపూర్ మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో ఏపియం,సీసీలుగా విధులు నిర్వహిస్తున్న మార్తమ్మ, జయమ్మపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ, తెలంగాణ ఐ.కె.పి వి.ఓ.ఏ ఉద్యోగుల సంఘం(సిఐటియు అనుబంధం)జిల్లా అధ్యక్షుడు డ్యామ్ అంజి డిమాండ్ చేశారు.గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ నర్సింగ రావుకి VOA లు, MSOB లతో కలిసి వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అలంపూర్ మండల మహిళా సమాఖ్యలో ఏపిఎం,సీసీలుగా విధులు నిర్వహిస్తున్న మార్తమ్మ,జయమ్మ లు వివోఏలు ఎంఎస్ఓబిలను వేధిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.ఏపియం పర్మిషన్ లేనిదే కార్యాలయానికి రాకూడదని అనుమతి తీసుకుని కార్యాలయంలోకి రావాలని, గ్రామాలకు వచ్చిన సందర్భంగా ప్రత్యేక వాహనం తీసుకొని రావాలని ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని,సీసీలకు సన్మానాలు చేయడం కోసం డబ్బులు, చీరలు ఇవ్వాలని,ఇతర బహుమతులు తీసుకురావాలని,మహిళా సంఘం పేరు మీద కాకుండా వివోఏల పేరు మీద చెక్కులు రాయాలని, మార్కెటింగ్ నుంచి వచ్చిన కమిషన్ ఎంఎస్సీలో వేయాలని, తమ బంధువులకు అనారోగ్యంగా ఉందని మహిళా సంఘం నుంచి డబ్బులు డ్రా చేయాలని, డిగ్రీ, బీఈడీ వంటి ఉన్నత చదువులు చదివిన VOA లను తీసివేస్తామని అంటూ అనేక పద్ధతులలో నిరంతరం ఇబ్బందులకు గురి చేస్తున్నరని విమర్శించారు.MSOB లను సైతం బ్యాంకర్ల ముందు అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.నిబంధనలకు విరుద్ధంగా మహిళా సమాఖ్య పనులను చేయిస్తున్నారని ఎవరైనా ఈ ఆర్థిక, అధికార దర్పానికి వ్యతిరేకంగా మాట్లాడితే మిమ్మల్ని ఉద్యోగాలనుండి తీసేస్తామని,గ్రేడింగ్ చేయకుండా చేస్తామని,5000 రూపాయలు తీసుకునే మీరు 70000 తీసుకునే నన్ను ప్రశ్నించే హక్కు ఎక్కడిదని బెదిరిస్తున్నారని, ఇలాగే ప్రశ్నిస్తే మీ పేర్ల మీద ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్త్రీ,పురుష తేడా లేకుండా తీవ్ర, అసభ్య పదజాలంతో వ్యక్తిగతంగా దూషిస్తూ అవమానాలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీఎం మార్తమ్మ సీసీ జయమ్మ లపై సమగ్ర విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకొని వేధింపులు అరికట్టాలని,మరొకసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమం లో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు ప్రభావతి,మండల సమాఖ్య అధ్యక్షురాలు శాలమ్మ VOA లు ఆధాకర్,M. లక్ష్మి,రాధ,భూలక్ష్మి గంగన్న,లావణ్య,సీతమ్మ,గురు,ఫార్జానా, రియాజ్ బేగం, మంజుల, నరసింహ, జానకి రాముడు గద్వాల మండల అధ్యక్షుడు తిమ్మప్ప, సహాయ కార్యదర్శి వెంకటరామయ్య పాల్గొన్నారు.