అరుణోదయల విలీన సభను జయప్రదం చేయండి.

Feb 2, 2025 - 20:24
Feb 3, 2025 - 18:42
 0  1
అరుణోదయల విలీన సభను జయప్రదం చేయండి.

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్: అరుణోదయల విలీన సభను జయప్రదం చేయండి. తెలంగాణ రాష్ట్రంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 2013లో చీలిపోయింది. చీలిన వారు తిరిగి ఈనెల ఐదు న సూర్యపేట జిల్లా కేంద్రంలో రెండు అరుణోదయ సంస్థలు విలీనం కానున్న నేపథ్యంలో విలీన సభ తిరుమల గ్రాండ్ లో ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు దీనికి పెద్ద ఎత్తున కవులు, కళాకారులు, సాంస్కృతిక కార్యకర్తలు హాజరుకావాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా కమిటీ సభ్యులు సామ నర్సిరెడ్డి కోరారు. పాత సూర్యాపేట గ్రామంలో కమ్యూనిటీ హాల్ నందు అరుణోదయ విలీన సభ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సామ నర్సిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఈ దేశంలో భూస్వామ్య, పాశ్చాత్య సంస్కృతి విచ్చలవిడిగా విద్యార్థి, యువత , ప్రజలపై తీవ్రంగా దాడి చేస్తుందని ఈ నేపథ్యంలో రెండు అరుణోదయ సంస్థలు విలీనం కావడం సాంస్కృతిక ఉద్యమానికి తోడ్పాటు అందిస్తుందని అన్నారు. ప్రజల ఆట,పాటలను, సాంస్కృతిక కార్యక్రమాలను కార్పొరేట్ మీడియా కైవాసం చేసుకుని లాభార్జన ద్యేయంగా, మనుషుల మెదళ్ళ పై సాంస్కృతిక దాడి కొనసాగుతుందని దీనికి సామాన్యులు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యపేట లో జరిగే విలీన సభకు ప్రొఫెసర్ కాసిం సార్ హాజరుకానున్నారని దీనికి పట్టణంలోని విద్యార్థులు, యువకులు, మేధావులు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూరరపు మమత,మరియమ్మ,తలకోప్పుల ఎల్లమ్మ,ఎదవల్లి మంగమ్మ,చెరుకుపల్లి రేణుక యడవల్లి యశోద,జ్యోతి, బాస్కు అనిల్ ,మంగయ్య తదితరులు పాల్గొన్నారు