అమెరికాలో స్విమ్మింగ్ పూల్ లో పడి పాతర్ల పహాడ్ వ్యక్తి

Aug 25, 2024 - 21:38
Aug 25, 2024 - 22:08
 0  12
అమెరికాలో స్విమ్మింగ్ పూల్ లో పడి పాతర్ల పహాడ్ వ్యక్తి

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ అమెరికాలో స్విమ్మింగ్ పూల్ లో పడి పాతర్ల పహాడ్ యువకుని మృతి. 5ఏళ్ల క్రితం ఉపాద్యాయునిగా వెళ్లిన ప్రవీణ్ కుమార్. మృతి చెందిన విషయం ఫోన్ ద్వారా తెలిపిన భార్య .. ఆత్మకూర్ ఎస్... అమెరికాలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలం పాతర్ల పహాడ్ గ్రామానికి చెందిన తప్సి ప్రవీణ్ కుమార్ 39. స్విమ్మింగ్ పూల్ లో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. భారత కాలమాన ప్రకారం శనివారం ఉదయం సుమారు 8గంటల ప్రాంతం లో ప్రవీణ్ కుమార్ వారి ఇంటి సమీపంలోని స్విమ్మింగ్ పూల్ వద్ద కాలక్షేపం కోసం వెళ్లి ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్ లో పడి మృతి చెందినట్లు మృతుని భార్య శాంతి ఆదివారం వారి కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలిపినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పాతర్లపాడు గ్రామానికి చెందిన తప్సి నాగయ్య కు ఇద్దరు కుమారులు ఒక కూతురు ఉండగా మృతుడు ప్రవీణ్ చిన్న కుమారుడు. ఎమ్మెస్సీ చేసిన ప్రవీణ్ హైదరాబాదులో భాష్యం పాఠశాల తో పాటు మరికొన్ని కాలేజీలు ఉపాధ్యాయులుగా పని చేశారు. ఉపాధ్యాయ వృత్తిలో మంచి నైపుణ్యం ఉన్న ప్రవీణ్ ఆస్ట్రేలియా ఇతర ప్రాంతాల్లో ఉపాధ్యాయులుగా పని చేసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. గత ఐదేళ్ల క్రితం తన మిత్రులతో కలిసి అమెరికాలో అట్లాంట ప్రాంతంలో ఉపాధ్యాయునిగా పని చేస్తూ శనివారం మృతి చెందినట్లు వారు తెలిపారు. ప్రవీణ్ కుమార్ మృతి సమాచారం తో గ్రామంలో విషాదం నెలకొన్నది.ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నదని రెండు రోజుల తర్వాత మృత దేహం ఇక్కడికి పంపే అవకాశం ఉన్నట్లు సమాచరం.