అభివృద్ధి పథంలో సూర్యాపేట నియోజకవర్గం పటేల్ రమేష్ రెడ్డి.
*విజయదశమి పండుగ సందర్భంగా సూర్యాపేట పట్టణం మండల పరిషత్ కార్యాలయంలో సంతోషిమాతను దర్శించుకుని, శమీపూజ చేసి అమ్మవారి అనుగ్రహంతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ, సూర్యాపేట పట్టణ పురపాలక సంఘం ఆధ్వర్యంలో జమ్మిగడ్డలో ఏర్పాటుచేసిన దసరా వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్,TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి*
ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ...
*సుఖశాంతుల తెలంగాణ సూర్యాపేట నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలి… జన సంక్షేమమే ప్రజా ప్రభుత్వ సంకల్పం అని అన్నారు.*
అభివృద్ధి పథంలో సూర్యాపేట నియోజకవర్గం...
*@ పర్యాటకశాఖ తరఫున సద్దుల చెరువు మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధికి రూ. 10 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది.*
*@ ఉండ్రుగొండ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయ అభివృద్ధికి రూ॥ 2.5 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది అని అన్నారు.*
*@ చారిత్రాత్మకమైన పిల్లలమర్రి శివాలయానికి అతి త్వరలో నిధులు కేటాయిస్తామని అన్నారు.*
ఈ కార్యక్రమంలో సూర్యాపేట నియోజకవర్గం శాసనసభ్యులు జగదీశ్వర్ రెడ్డి , మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ కౌన్సిలర్స్ కాంగ్రెస్ మరియు ఇతర పార్టీ నాయకులు వివిధ హోదాల్లో ఉన్న అధికారులు తదితరులు పాల్గొన్నారు.