గమనం సైబర్ నేరాలపై అవగాహన సదస్సు
మునగాల 04 నవంబర్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మునగాల నెమలిపురి గమనం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించటం జరిగినది. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా షీ టీం ఏఎస్ఐ కృష్ణమూర్తిగారు జిల్లా ఇన్చార్జి జ్యోతి గారు మాట్లాడుతూ ఆడపిల్లలకు వాట్స్అప్ గ్రూపులో మెసేజ్లు చేయవద్దని పెద్దవారి కంటే పిల్లలే ఎక్కువగా ఇంటర్నెట్ ఫోన్లో ఉపయోగిస్తున్నారని వారన్నారు అలాగే సైబర్ నేరాలపై ఎక్కువగా పిల్లలు తల్లిదండ్రులు అందుకే విద్యార్థులు వీటివల్ల జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని వారన్నారు
గమనం స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు అంకతి అనసూయ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని వారన్నారు. ఈరోజు సైబర్ నేరాలు అనేక రూపాల్లో జరుగుతున్నాయని పేరెంట్స్ కి ఫోన్ చేసి కొంత మంది సైబర్ నెరగాళ్లు మీ అబ్బాయి బ్యాగులో డ్రగ్స్ దొరికిందని పోలీసులు అరెస్టు చేశారని, ఫోన్లు చేసి వారిని ట్రాక్ లో పెట్టి అనేక రకాలుగా మోసం చేస్తు మోసం చేస్తూ లక్షల రూపాయలు వారి దగ్గర నుంచి వసూలు చేస్తున్నారని తెలిపారు. చదువు లేని వారి నుండి ఉద్యోగస్తుల వరకు రోజుకు తెలుగు రాష్ట్రాల్లో ఐదు కోట్ల రూపాయల వరకు పోగొట్టుకుంటున్నారు ఈ సైబర్ నేరగాళ్ల ఆట కట్టించాలంటే ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో మునగాల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఝాన్సీ రాణి గారు మరియు పాఠశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు .