ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట... జగ్గయ్యపేట హైవే పై వెంకట సాయి
ఫుడ్ ప్లాజా ఎదురుగా ఉన్న అక్రమ డివైడర్ ని పరిశీలించిన సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రాజు లు..
తెలంగాణ వార్త:- ఈసందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ...
నిన్న సాయంత్రం వెంకట సాయి ఎదురుగా ఉన్న డివైడర్ దగ్గర ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వెళుతూ ప్రమాదానికి గురయ్యారు...
ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలు కావడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు...
గత నాలుగు సంవత్సరాలలో ఈ ప్రాంతంలో సుమారు 16 యాక్సిడెంట్లు జరగగా 8 మంది మృతి చెందారు...
భవిష్యత్తులో ఎన్నో ప్రమాదాలు జరుగుతాయని భావించి నేషనల్ అథారిటీ వాళ్ళతో మాట్లాడి వెంటనే జెర్సీ బ్లాక్ లతో డివైడర్ ని మూసి వేయడం జరిగింది...
ఇంకా జెర్సీ బ్లాక్ ల మధ్యలో కొంచెం కొంచెం గ్యాప్స్ ఉన్నాయి ఆ గ్యాప్సన్ కూడా జెర్సీ బ్లాక్స్ ని తెప్పించి పటిష్టంగా కంప్లీట్ చేస్తాము...
భవిష్యత్తులో ఇది ఓపెన్ కాకుండా చర్యలు తీసుకుంటాము...
ఇక్కడినుంచి షేర్ మహమ్మద్ పేట గ్రామానికి, ఆటోనగర్ కి వెళ్లడానికి ఈ డివైడర్ ని ఉపయోగిస్తున్నారు....
షేర్ మొహమ్మద్ పేట, ఆటోనగర్ వారు అండర్ పాస్ ద్వారా వెళ్లాలని ఇక్కడ ప్రమాదాలు జరగకుండా సహకరించాలని సీఐ వెంకటేశ్వర్లు టీవీ5 ద్వారా తెలియజేసారు....