అన్నదాన సత్రం ఆరంభ శురత్వమేనా..? 

Aug 1, 2025 - 19:49
 0  10

- రెండవ రోజు 200 మంది భక్తులు రాగానే అయిపోయిన భోజనాలు 

- భోజనాల కొరకు పోటీ పడ్డ భక్త యాత్రికులు 

- సిబ్బందితో వివాదానికి దిగిన భక్తులు 

- ప్రశ్నించిన బిజెపి ప్రసాద్ స్కీం ముందు ఆందోళన 

- సమస్యను పరిష్కరిస్తానన్న ఆలయ ఈఓ 

జోగులాంబ గద్వాల 1 ఆగస్టు 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి :  అలంపురం. జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయానికి సంబంధించిన బ్రహ్మేశ్వర నిత్యాన్నదాన సత్రం నిన్ననే ప్రసాద్ స్కీం భవనంలో మంత్రులు ఎమ్మెల్యేల మధ్య ఆర్భాటంగా ప్రారంభించబడింది. అయితే ఈ ఆర్భాటం ఎంతోసేపు నిలవలేదు. ఆరంభ శూరత్వం ఉన్నట్టు రెండో రోజు 200 మంది భక్తులకు అన్నదానం దక్కింది. సుమారు 300 మంది పైన భక్తులు భోజనం కొరకు అన్నదాన సత్రానికి చేరుకున్నారు. అన్నం లేకపోవడంతో సిబ్బందిపై భక్తుల ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాన సత్రంలో బెంచీలు కుర్చీలపై భక్తులు కూర్చోబెట్టి వడ్డించేందుకు అన్ని సౌకర్యాలను వాటిని పక్కకు పెట్టడంతో భక్తులు కిందనే భోజనాలు చేశారు. సిబ్బంది కొరత కారణంగా బఫే సిస్టం ఏర్పాటు చేశామని ఆలయ అధికారులు చెప్పారు. కాగా రోజుకు వెయ్యి మంది వరకు భోజనాలు పెడతామని గతంలో ఆలయ ఈఓ చెప్పారు. ఇంత ముందుకు పాత అన్నదాతలో ప్రతిరోజు 500 మందికి భోజనాలు పెడుతున్నామని చెప్పేవారు. 
 ఇక్కడ చూస్తే కనీసం 200 మంది భక్తులు కూడా భోజనం సరిపోలేదు. దీంతో భోజనం కొరకు భక్తులు పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చింది. విషయం తెలుసుకున్న బిజెపి జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు 
జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, రాజశేఖర్ శర్మ, రాజగోపాల్, నాగేశ్వర్ రెడ్డి, మురళి, మద్దిలేటి ఈశ్వర్, నాగ మల్లయ్య తదితరులతో ప్రసాద్ స్కీం భవనంలోని అన్నదాన సత్రం చేరుకున్నారు . భక్తులకు అండగా నిలిచి వచ్చిన వారందరికీ భోజనం పెట్టాలని సూచించారు. ఫోన్లో ఆలయ ఇఓ కు సమస్యను వివరించారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333