తెలంగాణ శ్రీచైతన్య విద్యాసంస్థల అవినీతిపై సీబీఐ,ఈడి తో విచారణ జరిపించాలి.
విద్య ముసుగులో శ్రీచైతన్య ఫీజుల దందా.
పి డి ఎస్ యు నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి.
పి డి ఎస్ యు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి మస్తాన్..
ఈరోజు పిడిఎస్యు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని అధిక ఫీజులు వసూలు చేస్తున్న శ్రీ చైతన్య విద్యాసంస్థలను రద్దు చేయాలని శాంతియుతంగా ధర్నా చేస్తున్న పిడిఎస్యు నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని త్రీవంగా ఖండిస్తున్నాము. అరెస్టు చేసిన నాయకులను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.
ఈ సందర్భంగా. పిడిఎస్యు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి జి మస్తాన్ మాట్లాడుతూ..
ఆంధ్ర కార్పొరేట్ విద్యాసంస్థ శ్రీ చైతన్య పేరుతో తెలంగాణలో అక్రమంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి వేలకోట్ల రూపాయల అవినీతి చేస్తున్న తెలంగాణ శ్రీ చైతన్య విద్యాసంస్థలపై సీబీఐ,ఈడి తో విచారణ జరిపించాలని, అక్రమంగా జిల్లాల్లో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలను రద్దు చేయాలని, యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSU డిమాండ్ చేస్తుంది.
తెలంగాణ శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో ఫీజులు నియంత్రణ చట్టం అమలులో లేదు. విద్యాహక్కు చట్టం అమలు చేయడం లేదు. లక్షల రూపాయలను వసూలు చేస్తూ దానికి తగిన విధంగా విద్యార్థులకు విద్యను, హాస్టల్ సౌకర్యాన్ని ఇవ్వడం లేదు. ఇటీవలే అనేక జిల్లాల్లో హాస్టల్ లో ఉంటున్న విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేవని, కనీసం విద్యార్థులకు పెడుతున్న భోజనం నాణ్యంగా లేదని, హాస్టల్స్ లో ఉంటున్న విద్యార్థులు జైల్లో ఉన్నట్టు ఉంటున్నామని వాపోతున్నారు. ఇది వీళ్ళ ధనధాహానికి పరాకాష్ట.
రవాణా శాఖ నిబంధనలు పాటించకుండా, బస్సుల ఫిట్నెస్ లేకుండా బస్సులు నడపడం ద్వారా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. అభం శుభం తెలియని అనేకమంది విద్యార్థులు దీని ద్వారా ప్రమాదాలకు గురవుతున్నారు.
నిబంధనలకు తూట్లు పొడుస్తూ, పేద మధ్య తరగతి విద్యార్థులను, తల్లిదండ్రులను మోసం చేస్తున్న శ్రీ చైతన్య విద్యాసంస్థలను వెంటనే రద్దు చేయాలని, 2025- 26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ నిలిపివేస్తూ విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. వీరి విచ్చలవిడి ఫీజులు దోపిడీ అవినీతిపై సిబిఐ, ఈడి లాంటి దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాము. దీని కొరకు రేపు,ఎల్లుండి (ఆగస్టు 26,27) రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ శ్రీ చైతన్య విద్యాసంస్థల ముందు ఆందోళన చేపడుతున్నాము. దీనిని జయప్రదం చేయాలని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రత్యక్షంగా సీబీఐ, ఈడి, ఏసీబీ కూడా ఫిర్యాదు చేస్తామని రెండు రోజుల్లో విద్యాశాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాము.
ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా కమిటీ సభ్యులు సాగర్, రామకృష్ణ, గోపి, అజయ్ ,వినోద్, అనూష పాల్గొన్నారు.
విప్లవ అభినందనలతో..
జి.మస్తాన్
పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి.
7729950490