అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ పాఠశాలల మాయలో పడకండి జె ఏ సి

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ పాఠశాలల మాయలో పడకండి సామాజిక సేవా జేఏసీ పిలుపు.... ఆత్మకూరు ఎస్.. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించి నాణ్యమైన విద్య తో పాటు ప్రభుత్వ పాఠశాలల ను మెరుగు పరచుకోవాలని సామాజిక సేవా జేఏసీ అధ్యక్షులు భూపతి రాములు తెలిపారు. ఆత్మకూరు మండలం నేమ్మికల్ గ్రామంలో శుక్రవారం నిర్వహించిన జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మన ఊరు మనబడి నీ అభివృద్ధి చేసుకుందామని జీవితకాలమంతా శ్రమించిన డబ్బుని ప్రభుత్వ స్కూలు చేతుల్లో పెట్టొద్దు, ప్రభుత్వంతో పని చేయించుకోవడం ప్రతి పౌరుని హక్కుఅన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులచే పని చేయించుకోవడం ఉత్తమ ఫలితాలు రాబట్టుకోవడం కోసం ప్రతి ఒక్కరూ నడుంబించాలని అన్నారు. గ్రామ విద్యలయాలు బాగుపడాలంటే ప్రతి ఒక్క గ్రామస్తులు విజ్ఞతా తో తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపించాలనీ తెలిపారు. ప్రతి గ్రామంలో ఏకగ్రీవ తీర్మానం చేయాలనీ కోరారు. ఉపాధ్యాయులు శక్తి వంచన లేకుండా పని చేస్తామని ప్రతిజ్ఞ చేయాలి ప్రజల్లో నమ్మకం కల్పించాలని అన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసుకునే ఈ మహా యజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మండల వ్యాప్తంగా జేఏసీ పిలుపునిచ్చింది. ఆత్మకూరు ఎస్ మండలం లో ప్రభుత్వ విద్య బలోపేతానికి వినూత్న కార్యక్రమాలు చేపట్టే దిశగా జేఏసీ ముందుకు వెళుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దండా వెంకట రెడ్డి, కరుణాకర్, గంపల కృపాకర్, తగుళ్ల జనార్ధన్, మేడి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు