అధికార యంత్రాంగంలో అవినీతిపై ఉక్కు పాదం మోపాలo టే ప్రజా పాలకులు కావాలి
.రాజకీయ అండతోనే ఉద్యోగుల అక్రమార్జన. ఈ రెండు వర్గాల గొంతు నొక్కాలంటే ప్రజా చైతన్యం, బలమైన చట్టాలు, ప్రజా శ్రేయస్సు కోరే న్యాయవ్యవస్థ కీలకం.
************
-- వడ్డేపల్లి మల్లేశం 9014206412
--28...05...2025**---*****
విద్యా వైద్యం సామాజిక న్యాయం ప్రజల మౌలిక సమస్యలు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి రైతుల ఇబ్బందులు మొత్తం పరిష్కరించవలసిన బాధ్యత ప్రభుత్వాలదె. అన్ని అవకాశాలు ఉన్నప్పుడు ప్రజలు అవినీతిని ప్రోత్సహించరు అవినీతి సహించరు కూడా. ఆయా వ్యవస్థలు సక్రమంగా పనిచేయని కారణంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు కూలీలు రైతులు సామాన్య వర్గాలు కార్యాలయాలకు పోయినప్పుడు వేలు లక్షల నుండి కోట్ల వరకు డిమాండ్ చేసిన సందర్భం మనదేశంలో చూడవచ్చు. ఒక్క రాష్ట్రమని కాదు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతున్నది మామూలు చిరు ఉద్యోగి కూడా కోట్ల రూపాయలను దండుకున్నట్లు పత్రికా ప్రకటనలు వస్తూ ఉంటే ఇక ఉన్నత స్థాయి అధికారి ఎన్ని వేల కోట్లు సంపాదించవచ్చో అర్థం చేసుకోవచ్చు. ఇదేనా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశించినటువంటి భారత ప్రజాస్వామ్యం? ప్రజల మౌలిక హక్కుల పరిరక్షణ కోసం రాజ్యాంగాన్ని రాసింది ఇందుకేనా? ఒక్కసారి ప్రజలంతా ఆలోచించాలి. 2025 మే మాసంలో ఈనాడు లో వచ్చిన సంపాదకీయాన్ని ( అవినీతి విష వలయం) పరిశీలించినట్లయితే భయంకరమైన అవినీతికి సంబంధించిన కొన్ని విషయాలు మన గుండె ఆగిపోయేంత పని చేస్తాయి. తిరుపతి జిల్లాలో ఒక గ్రామ పంచాయతీ కార్యదర్శి 30 కోట్ల ఆస్తిపాస్తులను కూడా పెట్టినాడంటే అత్యున్నత స్థాయి అధికారి ఎన్ని వేల కోట్లు సంపాదించవచ్చు అర్థం చేసుకోవాలి. నకిలీ వైద్యులను కటకటాల్లోకి పంపకుండా ఉండడానికి 16 లక్షలకు బేరం కుదుర్చుకున్నారట సూర్యాపేటకు చెందిన ఇద్దరు ఉన్నత అధికారులు. ఒడిస్సా గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీర్ పైన అనుమానంతో సోదా కోసం అధికారులు వెళ్తే 37 లక్షల అక్రమ సొమ్మును అతడు కిటికీలోంచి బయటికి విసిరి వేసిన సంఘటన చూసి ఆశ్చర్యపోయారు. అవినీతి నిరోధక శాఖ వైఫల్యానికి ఈ కొన్ని సంఘటనలు తాజా ఉదాహరణ మాత్రమే. చిత్తూరు జిల్లాలో ఓ సామాన్య పేద రైతు తన భూమి తన పేరు మీద రికార్డుల్లో లేదని సవరించమని కోరినందుకు చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ఇన్చార్జి తాసిల్దార్ ఆ రైతును ఒకటిన్నర లక్షల రూపాయలు డిమాండ్ చేశారంటే వాళ్ల నిత్య జీవితం ఏ రకమైన కార్యకలాపాలతో కొనసాగుతున్నది అర్థం చేసుకోవచ్చు. కాలేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇద్దరు అధికారులు 100 కోట్ల రూపాయల చొప్పున అక్రమాస్తులను పోగు చేసుకున్నట్లు ఇటీవల వెలుగు చూసిన విషయాన్ని కూడా ఈ పత్రిక ప్రస్తావించింది. నీతికి వ్యతిరేకమైనదంతా అవినీతి అందులో ప్రధానంగా ప్రజల సొమ్మును అప్పనంగా కూడా పెట్టుకుని పేదలను మరీ పేదరిక పేదరికంలోకి నెట్టు వేయడం ఆరోగ్యకరమైన భారతావనికి శ్రేయస్కరం కాదు. రాజ్యాంగపరంగా సంక్రమించిన అవకాశాలు హక్కులను సామాన్య ప్రజానీకానికి అందకుండా ఆటంకపరుస్తున్న అక్రమ దుష్ట శక్తులు ఈ అవినీతిపరులైన ఉద్యోగులను నిలువరించక లేక పోతున్నాం అంటే ఎవరి వైఫల్యం? మనం నిదానంగా ఆలోచించాలి పరిష్కారాలను వెతకాలి. ఇది కేవలం బాధితుల సమస్య మాత్రమే కాదు. నోరుండి మూగవాళ్లు అయిన బుద్ధి జీవులు మేధావులు ఆలోచన పరులు అందరి ముందున్నటువంటి కటోరమైన సవాల్గా స్వీకరించాల్సిన అవసరం ఉంది. ఇవి ఒకటి రెండు ఉదాహరణలు మాత్రమే గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక జిల్లా అధికారి కోటి రూపాయలను డిమాండ్ చేసిన విషయం కూడా పత్రికల్లో చూసి ఉన్నాము. అంతేకాదు ఉద్యోగులచే పీడించబడినటువంటి రైతులు విధి లేని పరిస్థితిలో పెట్రోల్ పోసి తగలబెట్టిన విషయం కూడా మనకు తెలుసు. అయినా దొంగల బుద్ధి మారడం లేదంటే అంతకుమించిన సిగ్గుమాలిన చేస్ట p మరొకటి ఉంటుందా?
మరికొన్ని గణాంకాలు అవినీతి నిర్మూలనకు పరిష్కారాలు :*
****---*******
అక్రమార్కులైన ఉద్యోగుల యొక్క ఈ రకమైన లంచాల దోపిడీ కారణంగా దేశ ప్రజలు ఏడాదికి సుమారు 21 వేల కోట్ల సంపదను కోల్పోతున్నారని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దేశ సంపదకు చెందిన వనరులఆ క్రమార్జనకు జరుగుతున్న చీకటి ఒప్పంధాల వల్ల దేశం ఏటా మరో లక్ష కోట్లు నష్టపోతున్నట్లు అంచనాలున్నాయి. ఈ లెక్కలు పదేళ్ళాకిందటివి ప్రస్తుతం అంచనా రెట్టింపు కావచ్చు కూడా. అక్రమార్కుల చెర లోకి చేరుతున్న ప్రజాదనాన్ని అంచనా వేయలేని ఈ దుస్థితిలో సామాజిక న్యాయ సాధనకు ఆటంకామౌతున్న ఈ అవినీతిని అడ్డుకోవాలంటే కఠినంగా వ్యవహారించాలని సర్వోన్నతన్యాయస్థానం గతంలో హెచ్చరించినప్పటికి ప్రయోజనం శూన్యం. చిత్తశుద్ధి లేని పాలకుల పుణ్యం ప్రధాన కారణం. ఉద్యోగ యంత్రాంగంలో నిర్మొలించడానికి రాజకీయ అవినీతి అవరోధం కావడం లేదా? 2019ఎన్నికల్లో అన్నిపార్టీల ఖర్చు 50000కోట్లు 2024లో రెట్టింపు కావచ్చు కూడా. పదోన్నతి పొందడానికి అక్రమప్రయోనాలకు అధికారగణంతో దాగూడూమూతలు కూడా ఈ అవినీతి జడలువిప్పడానికి కారణమౌతున్నది. అవినీతి నిరోధక శాఖలు, సిబిఐ, ఈడి, ఇతర విచారణ సంస్థలు, న్యాయ వ్యవస్థలు ఉండగా కూడా ఇంత అవినీతి జరుగుతున్నదంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాని దీనస్థితి. బలమైన ప్రజా చట్టాలు, న్యాయవ్యవస్థ జోక్యం, ప్రజాఉ ద్యమాల ధ్వారా ఈ గడ్డు పరిస్థితికి భారతదేశంలో ఎంత తొందరగా వీలైతే అంత తొందరలో చెక్ పెట్టినప్పుడు మాత్రమే కనీస మానవాభివృద్ధిని చూడగలము. లేకుంటే అసమానతలు అంతరాలు భూమ్యాకాశాలకు ఉన్నంత స్థాయిలో పెరిగే ప్రమాదం ఉంది.విచారణ శిక్షలతో పాటు రాజకీయ సంకల్పం కీలకం కావాలి.