ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే ఏమవుతుంది

.*  ఎన్నికల కోడ్ లోని అంశాలు  ఏ మేరకు అమలవుతున్నాయి.

May 11, 2024 - 22:11
May 27, 2024 - 20:03
 0  18
ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే ఏమవుతుంది

అధికార పార్టీల అకృత్యాలను అడ్డుకోవడానికి  అవకాశాలు ఏమైనా ఉన్నాయా.?

ఎన్నికల సంఘం ఉక్కు పాదం మోపినప్పుడే మాత్రమే  ప్రధాని సహా ఎవరైనా  చట్టానికి ఉన్న లోబడి  ఉంటారు !

---వడ్డేపల్లి మల్లేశం 

1960లో తొలిసారిగా కేరళ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విధులు- నిషేధాలు పేరుతో కొన్ని నిబంధనలను అక్కడి పాలనయాత్రంగం అమల్లోకి తె చ్చింది. ఆ తర్వాత 60 ఏళ్లలో అది మార్పులకు లోనవుతూ ప్రస్తుత నియమావళి రూపాన్ని సంతరించుకున్నట్లుగా మనం గుర్తించాలి . 1974 ఎన్నికల సందర్భంగా నియమావళి అమలుపైన  అన్ని పార్టీలు కచ్చితంగా పాటించేలా చూడడానికి ఉల్లంఘనలను  నమోదు చేయడానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అన్ని పార్టీల ప్రతినిధుల సభ్యులుగా కమిటీలను ఏర్పాటు చేయడం ప్రారంభమైనది.  77 లోక్సభ ఎన్నికల సందర్భంగా మరోసారి అన్ని పార్టీలకు  ఎన్నికల సంఘం నియామవాల్ని పంపించింది . అనేక సందర్భాలలో వచ్చిన  నిబంధనలను క్రో డీకరించి 19 91లో ప్రస్తుతం అమల్లో ఉన్న నియమావళి రూపొందించినట్లు  తెలుస్తున్నది. 

చట్టబద్ధత కోసమే ఎన్నికల నియమావళి  :-

ఎన్నికల నియమావళిని నిర్దేశించే ప్రత్యేక చట్టం లేకపోయినప్పటికీ సుప్రీంకోర్టు పలు సందర్భాలలో ఎన్నికల కోడ్ను సమర్తి0 చినది.  ఎన్నికల సంఘం తన అధికారాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి వీలుగా కోడుకు చట్టబద్ధత కల్పించాలని 2013లో పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫారసు చేయడంతో పాటు  అభ్యర్థుల ఎన్నికల పరిమితిపై మరింత స్పష్టత కోసం సవరణ చేయాలని సూచించినది.  అలాగే ఎన్నికల వివాదాలను 12 నెలల్లోగా పరిష్కరించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా సూచించినప్పటికీ  పార్లమెంటు తరఫున అలాంటి చట్టం ఏది చేయబడలేదు. కానీ  ఎన్నికల సంఘం వివిధ సందర్భాలలో దృష్టికి వచ్చిన అంశాలను నిబంధనవళిగా రూపొందించడం  సుప్రీంకోర్టు ఆమోదించడం  ఈ దేశంలో జరిగిన కొన్ని గొప్ప మార్పులుగా భావించవచ్చు .

 అయితే ఎన్నికల సంఘం  తన అధికారాన్ని పటిష్టంగా ఉపయోగించగలిగితే అరాచకాలను అకృత్యాలను వ్యయపరిమితిని అడ్డుకోవడానికి మరింత మెరుగైన పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నది . ఎన్నికల ప్రచారము, పోలింగ్, ఓట్లు లెక్కింపు  పారదర్శకంగా అవినీతికి  వ్యతిరేకంగా అమలు చేయడానికి కేంద్రంలో రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ప్రభుత్వ యంత్రాంగం అధికార వినియోగానికి పాల్పడకుండా ఉండడానికి ఈ నిబంధన   అవసరం . తద్వారా అన్ని వర్గాల అభ్యర్థులకు సమాన అవకాశాలు దక్కుతాయని ఆశిస్తున్నారు. కానీ ఆచరణలో ఇటీవల  కొంతమంది ప్రచారంలో కేసులు నమోదు చేస్తే ,మరికొంతమంది పైన నమోదు చేయకపోవడం, కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ స్వయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద  అరెస్టు వారెంట్లు జారీ చేయడం లాంటివి చూసినప్పుడు  ఎన్నికల సంఘం మరింత పారదర్శకంగా  ఉండాలని తెలుస్తుంది. ఈ విషయంలో ప్రధానమంత్రి తో సహా సామాన్యుల వరకు ఎవరు నేరం చేసిన శిక్షించాల్సినదే. .

 మార్చి 16  శనివారం 2024 రోజున కేంద్ర ఎన్నికల సంఘం  18వ లోక్సభకు సంబంధించి పోలింగ్ షెడ్యూల్ను విడుదల చేయగానే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.  ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు అమల్లో ఉండే ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు అని ఎన్నికల సంఘం ప్రకటించినప్పటికీ  ఆచరణలో చూడవలసి ఉంటుంది.  అధికార పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి  ఎన్నికల సంఘం అనుకూలంగా వ్యవహరిస్తున్నది అనే ఆరోపణలు అప్పుడప్పుడు వస్తున్న నేపథ్యంలో  ఈసీ తన స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవడానికి  పేద వర్గాలకు చెందిన అభ్యర్థుల ప్రయోజనాలకోసం  కఠినంగా వ్య వహ రించవలసి ఉన్నది.

ప్రచారంలో నిషేధించిన కొన్ని అంశాలు :-

మధ్యము నగదు పంపిణీ, థా యిలాల ప్రకటన, ఆస్తుల ధ్వంసం, నకిలీ వార్తలు, ఓటర్ల తరలింపు, రెచ్చగొట్టే ప్రసంగాలు, అనుచిత వ్యాఖ్యలు ,అన్ పార్లమెంటరీ భాష,  కులం మతం ప్రాతిపదికన ఓట్లు అడగడం ,ఆయుధాల ప్రదర్శన, భయపెట్టడం, నిరాధార ఆరోపణలు చేయడం, అధికార పార్టీ తన హోదాను  ప్రభుత్వ యంత్రాంగాన్ని అధికార వనరులను అక్రమంగా  వినియోగించడం కూడా నిషిద్ధమే . ఈ నియమాలని ఉల్లంఘించిన వారికి ఈసీ నోటీసు పంపడంతో పాటు కొన్ని సందర్భాల్లో క్షమాపణ చెప్తే వదిలేస్తారు, మరికొన్ని విషయంలో మందలించడం, ప్రచారానికి వెళ్లకుండా నిలువరించడం వంటి చర్యలను  తీసుకుంటుంది . అయితే పైన  వివరించిన నిషేధాలు  ఏ మేరకు అమలవుతున్నాయో ఒక్కసారి పరిశీలిస్తే మనకు అర్థం అయిపోతుంది మద్యం నగదు రోజు పట్టు పడుతూనే ఉంది, ఆస్తుల విధ్వంసం  కొనసాగుతూనే ఉన్నది,

 నకిలీ వార్తలు ఓటర్ల తరలింపు డబ్బులు, పంపిణీ రెచ్చగొట్టే ప్రసంగాలు  కులం మతం ప్రాతిపదికన ఓటర్లతో సంభాషణలు  సమావేశాలు  ఆరోపణలు చేయడం,  అధికార దుర్వినియోగం  మనం కల్లారా చూస్తూనే ఉన్నాం. ఈ విషయంలో ఇటీవల  కాంగ్రెస్  మేనిఫెస్టోను ప్రస్తావిస్తూ స్వయంగా ప్రధానమంత్రి చేసినట్లు చెప్పబడుతున్న వ్యాఖ్యలు  ప్రజల సంపద అంతా దోచి మైనారిటీలకు అప్పజెప్పే అవకాశం ఉన్నది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అనే ప్రచారం  పత్రికలకు ఎక్కిన విషయం తెలిసిందే . ఎన్నికల సంఘానికి వివక్షత లేకుండా  నియమావళిని కచ్చితంగా అమలు చేయడం  అలవాటు చేసుకోవాలి.

ఇక ఎన్నికల  కోడ్ అమల్లో ఉన్న సందర్భంలో రాజ్యాంగంలోని 324వ అధికరణం ప్రకారం ఎన్నికల షెడ్యూలు విడుదలైనప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు రాజకీయ పార్టీలు అభ్యర్థులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనులను పర్యవేక్షించే అధికారం ఎన్నికల కమిషన్కు మాత్రమే ఉంటుంది.  స్థానికంగా ఉన్న ప్రభుత్వాలు నామ మాత్రంగానే  ఉండడంతో పాటు ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేదు.  కోడు ఉల్లంఘన పైన ఎవరైనా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు,  న్యాయస్థానాలను కూడా ఆశ్రయించవచ్చు,  దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం పరిశీలకులను నియమిస్తే  వారిద్వారా ఎన్నికల నిబంధనల అమలు పరిశీలించబడుతుంది .  నిబంధనల యొక్క అమలను పర్యవేక్షణ చేసినప్పటికీ  ఎన్నికల  ప్రచార సందర్భంగా రాజకీయ పార్టీలు చేస్తున్న ఖర్చు తారాస్థాయికి చేరుకున్న పట్టించుకోవడం లేదు. అంతేకాదు ఉచిథా ల పేరుతో భారీగా ప్రకటనలు చేయడమే కాకుండా ప్రలోభ పెట్టినటువంటి సందర్భాలను కూడా చూసి చూడనట్లు వ్యవహరించడం సరైనది కాదు.  మద్యం డబ్బు పంపిణీ కూడా ఓటర్లకు చేరుతూ ఉంటే ఈ ఎన్నికలు నిజాయితీగా జరిగినట్లు ఎలా గుర్తించవచ్చు?  అంతేకాకుండా 30,- 40 శాతం ఓటర్లు మాత్రమే  ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఈ దేశాన్ని పరిపాలిస్తే అది నిజంగా మెజారిటీ ప్రజల  ప్రభుత్వం ఎలా అవుతుందో దేశవ్యాప్తంగా చర్చ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది.
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333