అడ్డగూడూరు ప్రభుత్వ దవాఖానలో డాక్టర్"ను నియమించాలి

డా"ప్రవీణ్ డిప్యుటీషన్ రద్దు చేసి తిరిగి అడ్డగూడూరులో కొనసాగించాలి
కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి చిప్పలపెళ్లి మహేంద్ర నాధ్
అడ్డగూడూరు 22 ఆగస్టు 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ దవఖానలో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్న నేపథ్యంతో రోగుల బాధను అర్థం చేసుకొని కొంతమంది మండల నాయకులు వెంటనే అడ్డగూడూరు ప్రభుత్వ దవఖానకు డాక్టర్ ను నియమించాలని జిల్లా వైద్యాధికారికి వినతిపత్రం అందజేశారు.యాదాద్రి భువనగిరి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్" మనోహర్ ను కలసి మాట్లాడుతూ.. మా దగ్గర ఉన్నా అడ్డగూడూరు ప్రభుత్వ దవాఖాన లో డాక్టర్ లు లేక మండల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.భారీ వర్షాల వల్ల ప్రజలు సీజనల్ వ్యాధులతో సరైన వైద్యం అందక ఇబ్బందులు గురవుతున్నారు.ఇంతకు ముందు అడ్డగూడూరు పి.హెచ్.సిలో రెగ్యులర్ ఉన్న డాక్టర్"ప్రవీణ్ ను డిప్యుటీషన్ పేరుతో రాజాపేట పి.హెచ్.సికి పంపించారు.మారుమూల ప్రాంతం ఇప్పడూ అడ్డగూడూరు హాస్పిటల్ లో డాక్టర్ లు లేక ప్రజలు ఆరోగ్యం కుంటుపడే ప్రమాదం ఉంది.కావునా వెంటనే డాక్టర్ ను నియమించాలని కోరారు.వినతిపత్రం అందజేసిన బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిప్పలపల్లి మహేందర్ నాథ్, పొన్నాల వెంకటేశర్లు మాజీ పిఎసిఎస్ చైర్మన్, మాజీ సర్పంచ్ ఇటికాల కుమార స్వామి,హన్మకొండ ఆనందచారి తదితరులు పాల్గొన్నారు.