అడ్డగూడూరులో మరో వ్యక్తిపై పోక్సో కేసు నమోదు..ఎస్సై వెంకట్ రెడ్డి

Jul 31, 2026 - 01:23
Jul 31, 2026 - 01:27
 0  1
అడ్డగూడూరులో మరో వ్యక్తిపై పోక్సో కేసు నమోదు..ఎస్సై వెంకట్ రెడ్డి


అడ్డగూడూరు 30 జూలై 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని మరో వ్యక్తిపై ఫోక్స్ కేసు నమోదు చేసినట్టు ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు.ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తేదీ 28.7.2026న మండలానికి చెందిన ఒక మహిళ తన మైనర్ కూతురు తప్పి పోయిందని,తన కూతురు తప్పిపోవడానికి అడ్డగూడురు గ్రామ నివాసి అయిన ఎలిజాల ఉమేషే కారణం అని ఫిర్యాదు చేయగా అదే రోజు అడ్డగూడురు పోలీస్ స్టేషన్ నందు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా ఆరోజు రాత్రి 8 గంటలకు సదరు బాలిక వంటరిగా అడ్డగూడూరు స్కూల్ నుండి వస్తూ కుటుంబసభ్యులకు కనిపించి పోలీస్ వారికి తెలుపగా సదరు బాలిక యొక్క వాంగ్మూలంను భువనగిరి భరోసా కేంద్రంలో రికార్డు చేయగా బాలిక తనను ఎలిజాల ఉమేష్ శారీరకంగా వాడుకున్నాడని తెలిపింది.వెంటనే బాలిక వాంగ్మూలం ఆధారంగా కేసులో పోక్సో చట్ట ప్రకారం వివిద సెక్షన్స్ ను జోడించి సదరు ఎలిజాల ఉమేష్ తండ్రి ప్రభాకర్ వయసు 24 సంవత్సరాలు వృత్తి డ్రైవింగ్ గ్రామము/మండలం అడ్డగూడూరు రామన్నపేట సిఐ ఎం రవి ఆధ్వర్యంలో శుక్రవారంరోజు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది.ఎలిజాల ఉమేష్ బాలిక 8వ తరగతి చదువుతూ వున్నప్పటి నుండి వెంటపడుతూ..ప్రేమ అని పెళ్లి చేసుకుంటా అని లోబరుచుకొని బాలికను శారీరకంగా వాడుకున్నాడు ప్రస్తుతం బాలిక ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంను ఆపేసి ఇంటిదగ్గర ఉంటున్నట్లు ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు.