తక్కువ నీటితో సాగు చేసే ప్రత్యామ్నాయ పంటలను రైతులు వేసుకోవాలి

 వ్యవసాయ విస్తీర్ణ అధికారి సురేందర్.

Jul 28, 2026 - 13:49
Jul 28, 2026 - 13:51
 0  6
తక్కువ నీటితో సాగు చేసే ప్రత్యామ్నాయ పంటలను రైతులు వేసుకోవాలి
తక్కువ నీటితో సాగు చేసే ప్రత్యామ్నాయ పంటలను రైతులు వేసుకోవాలి

జోగులాంబ గద్వాల 28 జూలై 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మండల పరిధిలోని   చాగాపురం గ్రామం లోనిరైతు వేదిక నందు మంగళవారం 9:30 గంటలకు   చాగాపురం సర్పంచ్ బిస్కలి సావిత్రమ్మ పరశురాముడు. పంచాయతీ కార్యదర్శి రవి గౌడ్. అధ్యక్షతన గ్రామసభ నిర్వహించడం జరిగింది. 

* పంచాయతీ కార్యదర్శి రవి గౌడ్. మాట్లాడుతూ....గ్రామంలోని ప్రజలందరూ ఎవరి వారిఇంటి దగ్గర  ఇంకుడు గుంతలు తీసుకోవాలని ఇంకుడు గుంతల వల్ల లాభాల గురించి ప్రజలకి అవగాహన కల్పించడం జరిగింది
* . గ్రామంలోని ప్రజలందరూ తడి చెత్త పొడి చెత్త వేరుచేసి గ్రామంలో తిరిగే గ్రామపంచాయతీ ట్రాక్టర్ కు తడి చెత్త పొడి చెత్త వేరుచేసి పరిశుద్ధ కార్మికులకు సహకరించాలని ప్రజలను కోరారు. 
* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డంపింగ్ యార్డ్ లోచెత్త వేయకూడదని నిబంధనలు ఉన్నాయని.సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని రైతులకు అవగాహన కల్పించారు.
 అనంతరం రైతులు కూడా తమ పంట పొలాలలో బోర్ వెల్ దగ్గర రీఛార్జ్ ఇంకుడు గుంతలు చేసుకోవాలని రైతులకు అవగాహన కల్పించారు.

 ఎనర్జీ ఎస్ టి ఏ శేఖర్. మాట్లాడుతూ... బోరు బావుల నిర్మాణ రీఛార్జి నిర్మాణాల గురించి వర్షపు నీరు వృధా కాకుండా నేరుగా భూమి లోకి చేరి వ్యవసాయ బోరు నీటిమట్టం . పెరుగుతుందని రైతులకు అవగాహన కల్పించారు. ప్రతి ఇంటి దగ్గర ఇంకుడు గుంత.ఊరికి ఒక చెరువు గుంత మన ఊళ్లో నిర్మించుకోవాలని నినాదాలు చేస్తూ రైతులకు అవగాహన కల్పించడం జరిగింది.

 వ్యవసాయ విస్తీర్ణ అధికారి సురేందర్. మాట్లాడుతూ... చాగాపురం గ్రామంలోని రైతులకు ఎల్‌నినో ప్రభావంపై ఆరుతడి పంటలపై రైతులకు .అవగాహన కల్పించారు. ఎల్‌నినో ప్రభావం,వర్షపాతం లోపం లేదా అసమాన వర్షాల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని రైతులకు సూచించారు. ఎల్‌నినో ప్రభావం వల్ల ఖరీఫ్ పంటలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశమున్న నేపథ్యంలో తక్కువ నీటితో సాగు చేసే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని రైతులకు వివరించారు. పంటల ఎంపిక, విత్తనాల వినియోగం,నీటి సంరక్షణ పద్ధతులు, పంటల నిర్వహణపై పలు సూచనలు అందించారు.వాతావరణ శాఖ సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు పాటించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యకమంలో ఉప సర్పంచ్ పరిశరాముడు.మాజీ ఎంపీటీసీ చెన్నుపాటి రాముడు.ఎన్ఆర్జిఎస్ టిఏ శేఖర్. జిపిఓ నాగరాజ్. జోగులాంబ గద్వాలజిల్లా వడ్డెర సంఘం అధ్యక్షుడు పరశురాముడు. అంగన్వాడి టీచర్లు. ఆశా కార్యకర్తలు. గ్రామా రైతులు తదితరులు ఉన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State