దేవాదాయ భూములు కౌలు ద్వారా నాలుగు లక్షల 24 వేల ఆదాయం
09-05-2026 తెలంగాణ వార్త రిపోర్టర్ చిన్నంబావి మండలం.
బేక్కేశ్వర ఆలయ భూముల కౌలు వేలం ద్వారా రూ.4.24 లక్షల ఆదాయం. గ్రామానికి?
చిన్నంబావి మండల పరిధిలోని బెక్కెం గ్రామంలో ఉన్న దేవదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలోని బెక్కేశ్వర స్వామి దేవస్థానం, చెన్నకేశవ స్వామి దేవస్థానాలకు చెందిన వ్యవసాయ భూములను శనివారం బహిరంగ వేలం ద్వారా రైతులకు కౌలుకు ఇచ్చినట్లు ఆలయ ఈవో రామేశ్వర్, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ మధుసూదన్ తెలిపారు.
వివరాల ప్రకారం, బెక్కేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన 19 ఎకరాల 20 గుంటల సాగుభూమిని వేలం ద్వారా కౌలుకు ఇవ్వగా రూ.2 లక్షల 82 వేల ఆదాయం సమకూరింది. అలాగే చెన్నకేశవ స్వామి దేవస్థానం సర్వే నంబర్ 108లో ఉన్న 11 ఎకరాల 23 గుంటల భూమిని లీజుకు ఇవ్వడం ద్వారా రూ.1 లక్ష 42 వేల ఆదాయం లభించినట్లు అధికారులు పేర్కొన్నారు.
వేలంలో పాల్గొన్న రైతులు రెండు సంవత్సరాల పాటు భూములను సాగు చేసుకునే హక్కును పొందినట్లు తెలిపారు. ఆలయాలకు సంబంధించిన భూములను పారదర్శకంగా వేలం నిర్వహించి కౌలుకు ఇవ్వడం ద్వారా దేవస్థానాలకు ఆదాయం పెరుగుతుందని అధికారులు వెల్లడించారు.
ఈ యొక్క కార్యక్రమాన్ని విమలేంక శివకుమార్ ముందుండి నడిపించారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ పరిశీలకుడు ఈవో రామేశ్వర్, ఇన్స్పెక్టర్ మధుసూదన్, ఆధ్వర్యంలో గ్రామస్తులు గజ్జ ఈదన్న, బిచ్చన్న, గొల్ల శేఖర్, గొల్ల లక్ష్మన్న, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.