అచ్యుత్ కుమార్ కి వరించిన కారు చిన్నారి ఆద్య కి సీఎంఆర్ లో దసరాకు షాపింగ్ చేసిన తల్లిదండ్రులు

Oct 15, 2024 - 17:39
Oct 15, 2024 - 18:13
 0  1
అచ్యుత్ కుమార్ కి వరించిన కారు చిన్నారి ఆద్య కి సీఎంఆర్ లో దసరాకు షాపింగ్ చేసిన తల్లిదండ్రులు

అచ్యుత్ కుమార్ కి వరించిన కారు చిన్నారి ఆద్య కి సీఎంఆర్ లో దసరాకు షాపింగ్ చేసిన తల్లిదండ్రులు ఉషా అచ్యుత్ కుమార్ 

సూర్యాపేట :  దసరా పండుగకు సాధారణంగా అందరు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కానీ వీరికి అదృష్టంను కూడా కలిసి వచ్చింది.సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన వీరాచారి దాబా హోటల్ నిర్వాహకులు అచ్యుత్ కుమార్ ఉషా దంపతులు తమ కూతురు ఆద్యకి దసరా పండుగ కోసం వస్త్రాలను కొనుగోలు చేసేందుకు జిల్లా కేంద్రం లోని సీఎంఆర్ షాపింగ్ మాల్ కి వెళ్లి వస్త్రాలను కొనుగోలు చేశారు. ఐతే సీఎంఆర్ వారు  కొనుగోలు చేసిన అందరికి కూపన్లు ఇచ్చారు. దసరా పండుగ సందర్బంగా కూపన్లు డబ్బాలో వేసిన వారికి మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ చేతుల మీదుగా లాటరీ తీయగా అచ్యుత్ కుమార్ పేరు మీద నాలుగు లక్షల ముప్పైఐదు వేల విలువైన మారుతీ ఆల్టో కారు వరించింది. సోమవారం రాత్రి సీఎంఆర్ నిర్వాహకులు కారు తాళంచెవిని అచ్యుత్ కుమార్ కి అందించి అభినందించారు.ఈ సందర్బంగా బంధు, మిత్రులు అచ్యుత్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరాచారి, ఉపేంద్రా చారి, సీఎంఆర్ మేనేజర్ కాశీ విశ్వంత్, సిబ్బంది సతీష్, రాంబాబు, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333