పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలి
ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యంతో చర్చలు జరిపి సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చొరవ చూపాలి.
ఎర్ర అఖిల్ కుమార్ పీడీఎస్యు రాష్ట్ర సహయ కార్యదర్శి రాష్ట్రంలో గత మూడు ఏళ్ళ నుండి 8వేల కోట్లకు పైగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యంతో చర్చలు జరిపి సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం త్వరలో చూపాలని పిడిఎస్ యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ లెనిన్ నగర్ లో పిడీఎస్యు అధ్వర్యంలో విలేఖర్ల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా పీడీఎస్యు రాష్ట్ర సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం అనుసరించిన విద్యార్థి వ్యతిరేక విధానాలను నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగిస్తుంది అన్నారు. గత మూడేళ్లుగా ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల ఇప్పటికే కొన్ని ప్రవేశ పరీక్షలు పూర్తయి పై చదువులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్నారు. పేద విద్యార్థులు అప్పులు చేసి మరి సర్టిఫికెట్స్ తీసుకుంటున్నారని అన్నారు. ఒకపక్క విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే,మరోవైపు ఆయా కళాశాల యాజమాన్యాలు అప్పులతో కళాశాల నడిపిస్తున్నాయని అన్నారు. జీతాలు చెల్లించలేమని సోమవారం నుండి కళాశాల బందుకు పిలుపునిచ్చారు అన్నారు. దీనిపై ప్రభుత్వం యాజమాన్యంతో చర్చించి పేద విద్యార్థులకు నష్టం లేకుండా నిధులు విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో డిగ్రీ మరియు పీజీ కళాశాల కంటే ప్రైవేట్ రంగంలో ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ విద్యార్థులు ఎక్కువగా ఉన్నారన్నారని, ప్రభుత్వ మొండి వైఖరి వలన వారు తీవ్రంగా నష్టపోతున్నారు అన్నారు.విద్యలో విప్లవాత్మక మార్పులంటూ ఇంటర్నేషనల్ స్కూల్స్, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ప్రారంభం చేస్తునే విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజులను విడుదల చేయకపోవడం దుర్మార్గం అన్నారు. తెలంగాణలో ఉన్నత విద్యారంగానికి ప్రాధాన్యత తగ్గించి విద్యను నీరుగార్చే ప్రయత్నం ప్రభుత్వం చేయడం దారుణం అన్నారు.కాబట్టి తక్షణమే ప్రభుత్వం పెండింగ్ ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.లేనియెడల విద్యార్థి ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.