విజయ్ దళపతి తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా
ఘనంగా కేక్ కట్ చేసి సీట్లు పంచుకొని శుభాకాంక్షలు
కోదాడ 11 మే 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– ఈరోజు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో యం.ఆర్.పి.యస్ కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి బచ్చలకూరి నాగరాజు మాదిగ ఆధ్వర్యంలో ఒక దళిత బహుజన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి విజయ్ దళపతి తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కోదాడ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కట్ చేసి సీట్లు పంచుకొని శుభాకాంక్షలు చెప్పడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమంలో యం.ఆర్.పి.యస్ కార్మిక శాఖ రాష్ట్ర అధ్యక్షులు చింత బాబు మాదిగ పాల్గొని ఒక దళిత బహుజన బిడ్డ తమిళనాడు సీఎం గా ప్రమాణస్వీకారం చేయడం యావత్ భారత దేశ బహుజన సమాజం గర్వించదగ్గ విషయం కావున తెలంగాణ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో తమిళనాడు సీఎం విజయ్ కి శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకుంటున్నాము. ఒకప్పుడు భారతదేశాన్ని ఏలిన జాంబవంతుడి వారసుడి లాగా విజయ్ తమిళనాడులో సువర్ణ సుపరిపాలన అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలు తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భావితరాలకు బహుజన రాజ్య స్థాపనకు బాటలు వేయాలి అని కోరుకుంటున్నాము. ఒక దళితుడు పార్టీ పెట్టి అన్ని పార్టీల కన్నా మెజారిటీ స్థానాలు గెలుచుకున్నాక కూడా కొన్ని మనువాద దుష్ట శక్తులు విజయ్ ని సీఎం కానివ్వకుండా ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు ప్రత్యక్షంగా పరోక్షంగా చేశారు కానీ వాటన్నిటినీ కూడా దాటుకొని ప్రమాణ స్వీకారం చేయడం గర్వించదగ్గ విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు కాంపాటి శ్రీనివాస్. గంధం యాదగిరి. మరియు షేక్ బాగ్దాద్, కందుకూరి నాగేశ్వరరావు, పాలడుగు సంజీవ్, గంధం శ్రీను, గంధం జాని, పిడమర్తి బాబురావు, అమరబోయిన శ్రీకాంత్, కుడుముల రాంబాబు, బొల్లె పోగు చంటి. చింతా వినయ్ సోమపంగు శ్రీను సిద్ధల రాంబాబు. మరియు డేగ బుడగ జంగాల నాయకులు, ఎంఆర్పిఎస్ నాయకులు మొదలైన వారు పాల్గొన్నారు