అంగరంగ వైభవంగా నిర్వహించిన గోదావరి హారతి.

May 10, 2026 - 21:40
 0  16
అంగరంగ వైభవంగా నిర్వహించిన గోదావరి హారతి.
అంగరంగ వైభవంగా నిర్వహించిన గోదావరి హారతి.
అంగరంగ వైభవంగా నిర్వహించిన గోదావరి హారతి.
అంగరంగ వైభవంగా నిర్వహించిన గోదావరి హారతి.
అంగరంగ వైభవంగా నిర్వహించిన గోదావరి హారతి.

గోదావరి హారతి మే 10 టెంపుల్ టౌన్ భద్రాచలం. :- భద్రాద్రి జిల్లా కలెక్టర్ చొరవతో దివ్య క్షేత్రం భద్రాద్రిలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న గోదావరి నదీహారతి ఈ ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

 శ్రీ సీతారాముల వారి సన్నిధి ప్రముఖ దివ్య క్షేత్రం భద్రాచలంలో ప్రవహిస్తున్న పుణ్య గోదావరి స్నాన ఘట్టాల వద్ద వరప్రదాయని గోదావరి నదికి నిర్వహించే గోదావరి నదీహారతినీ కనులారా వీక్షించే భక్తులకు ఎంతో ప్రతిష్టాత్మక మైనదని పురోహితులు రామా వజ్జల రవికుమార్ అన్నారు.

ప్రతిఆదివారం నాడు గోదావరి స్నాన ఘట్టాల వద్ద జరుగుతున్న నదిహారతి కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ, రెవెన్యూ, దేవాదాయ శాఖల సిబ్బంది, మరియు స్థానిక భద్రాద్రి పురోహిత సంఘం పురోహితులు సహకరిస్తుండడంతో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న గోదావరి హారతిని చూడడానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోందనీ ఆయన అన్నారు. పరాభవ నామ సంవత్సరం వైశాఖమాసం కృష్ణపక్షం బహుళ అష్టమి ఆదివారం జరుగుతున్న ఈ పుణ్య కార్యం పురోహితులు గోదావరి హారతి విశేషాలను, విశిష్టతను భక్తులకు తెలిపి, గణపతి పూజ నిర్వహించి 108 దీపోత్సవం భక్తులచే వెలిగింప చేసి, భక్తులు స్పృశించిన పూజా ద్రవ్యాలతో, శ్రీరాముని కి, గోదావరి నదికి అష్టోత్తర శతనామార్చన చేసి లోక కళ్యాణార్ధం ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఈ మహత్కార్యములో గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రామానుగ్రహంతో గోదావరి మాత ఆశీస్సులు పొందుతున్నారని ఆయన అన్నారు.

శాంతి మంత్ర పఠనం జరిపి గోదావరి హారతి కార్యక్రమాన్ని ముగించి శ్రీ కుంచాల రాజశేఖర్ దంపతుల ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారని, పూజా సామాగ్రి రెడీమేడ్ బట్టల షాప్ అసోసియేషన్ భద్రాచలం వారు అందించారని తెలిపారు.

 గోదావరి నది హారతి ముగిసిన అనంతరం చిన్నారి చేతన శ్రీ భరతనాట్యం గోదావరి నది హారతి తిలకించడానికి వచ్చిన భక్తులు తిలకించి చిన్నారికి ఆశీర్వచనాలు అందించారు.

ఈ కార్యక్రమంలో  పురోహితులు సత్య ప్రసాద్ శర్మ, రామాచార్యులు, ఫణి కుమార్ శర్మ, తేజ శర్మ, కృష్ణ శర్మ హారతులు సమర్పించగా,స్వచ్ఛంద సంస్థలు, స్థానికులు మరియు , అధిక సంఖ్యలోభక్తులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333