అర్వపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పి నరసింహ
పిర్యాదుదారులకే నేరుగా ఫోన్ చేసి మాట్లాడి మీ పిర్యాదుపై పోలీసులు ఎలా స్పందించారు అంటూ పలకరించిన ఎస్పి.
అర్వపల్లి /సూర్యాపేట 09 మే 2026 తెలంగాణవార్త రిపోర్టర్ :- ఈరోజు జిల్లా ఎస్పీ నర్సింహా అర్వపల్లి పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలు పోలీస్ స్టేషన్ నందు నిర్వహిస్తున్న రికార్డ్స్ ను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదులు చేసిన బాధితులకు ఎస్పీ నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు మీ ఫిర్యాదులపై మా పోలీసులు ఎలా స్పందించారంటూ వారిని పలకరించారు. పోలీస్ స్టేషన్ నందు నిర్వహిస్తున్న రిసెప్షన్ సెంటర్ తనిఖీ చేసి ఫిర్యాదుల వివరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇవ్వడానికి వచ్చిన బాధితులతో మాట్లాడి సమస్యలు త్వరితగతిన పరిశీలించాలని సంబంధిత ఎస్సైను ఎస్పీ ఆదేశించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పిర్యాదులపై త్వరితగతిన స్పందించి బాధితులకు బరోసా కల్పించాలని సిబ్బంది సూచించారు, బాధితులతో మర్యాదగా ప్రవర్తిస్తూ వారిలో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని పెంచేలా పనిచేయాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు అక్రమ రవాణాలను పూర్తిగా నిరోధించాలని ప్రజల భాగస్వామ్యంతో పనిచేయాలని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. సామాజిక అంశాల పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించి సైబర్ మోసాలు రోడ్డు భద్రత మహిళా భద్రత గురించి తెలియజేయాలని అన్నారు. బాధితులు, ప్రజలు నేరుగా పోలీస్ స్టేషన్ కి వచ్చి ఎలాంటి ఫైరవీలు లేకుండా సమస్యలపై ఫిర్యాదులు చేసుకోవాలని, పోలీసులను సంప్రదించడానికి డయల్ 100 కు ఫోన్ చేయాలని అన్నారు.
ఎస్పీ వెంట నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు స్థానిక ఎస్సై పోలీస్ సిబ్బంది ఉన్నారు