అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. సిపిఎం డిమాండ్
జోగులాంబ గద్వాల మూడు మే 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల మే 1వ తేదీ అర్ధరాత్రి ఉండవల్లి మండలం ప్రాగటూరు గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో పశుగ్రాసంతో పాటు ఏ పనిముట్లు తదితర సామాగ్రి కోల్పోయిన రైతులను ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి డిమాండ్ చేశారు శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో రైతులతో కలిసి కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేశారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే ఒకటి గురువారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో గ్రామానికి చెందిన 12 మంది రైతులకు సంబంధించిన 18 గడ్డివాములు పూర్తిగా కాలి బూడిద అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు వివిధ ప్రాంతాల నుండి డబ్బులు ఖర్చు పెట్టి పశువుల మేత కోసం తీసుకువచ్చిన పశుగ్రాసం, వరిగడ్డి బుడ్డల పొట్టు శనగ పొట్టు మినముల పొట్టు కందిపొట్టు పెసర పొట్టు జొన్న చొప్ప పూర్తిగా కాలిపోయాయన్నారు వీటితోపాటు పశువుల కొట్టాలు,ఆయిల్ ఇంజన్లు, బోర్ పంపులు,వంటి వ్యవసాయ సామాగ్రి కోల్పోయి రైతులు పూర్తిగా రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటనలో ఇప్పటివరకు పూర్తిగా 25 లక్షల రూపాయల నష్టం జరిగిందని అన్నారు అసలే వేసవి కాలం కావడంతో పశు గ్రాసం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు నిల్వ ఉంచుకున్న పశుగ్రాసం కాలి పోవడంతో ప్రస్తుతం ఉన్న పశువులకు మేత లేక తీవ్ర ఇబ్బందులకు రైతులు గురి అవుతున్నారని అన్నారు కావున ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేసి ప్రభుత్వం తరఫున రైతులకు ఆర్థికంగా నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని వెంటనే కొంత పశుగ్రాసం కూడా ఇప్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు సింగరాజు మద్దిలేటి, ఉప్పేరు నరసింహ, న్యాయవాది లక్ష్మణ్ ప్రాగటూరు గ్రామ శాఖ కార్యదర్శి మధు సభ్యులు చెన్న రాయుడు, రంగన్న హుస్సేన్, దానయ్య తో పాటు బాధిత రైతులు పాల్గొన్నారు.