అక్రమ మైనింగ్ అనుమతులను రద్దు చేయాలని రైతుల ధర్నా

Dec 28, 2025 - 19:37
 0  4
అక్రమ మైనింగ్ అనుమతులను రద్దు చేయాలని రైతుల ధర్నా

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ : అక్రమంగా మైనింగ్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని రైతులు ధర్నా చేసిన సంఘటన ఆదివారం పాత సూర్యాపేట గ్రామపంచాయతీలో చోటుచేసుకుంది. రైతులు తెలిపిన వివరాల ప్రకారం నెమ్మికల్ రెవెన్యూ గ్రామ శివారు అయిన 701 సర్వే నెంబర్ లో గల జవాన్లబోడుకు అక్రమంగా మైనింగ్ అనుమతులు ఇచ్చారని రైతులు ఆరోపించారు. ఈ జవాన్లబోడు 17 ఎకరాలలో విస్తరించి ఉందని, అందులో ఐదు ఎకరాలకు అక్రమంగా మైనింగ్ అనుమతులు ఇచ్చారని రైతులు తెలిపారు. ఆ బోడుకు వెళ్లడానికి కనీసం ఎలాంటి దారి లేదని బోడు చుట్టు వివిధ సర్వే నెంబర్లలో 100 ఎకరాలలో పట్టా భూమి ఉందని, ఆ భూమిలో వరి, పత్తి లాంటి పంటలను సాగు చేస్తారని తెలిపారు. సాగుభూమి మధ్యలో మైనింగ్ అనుమతి ఇవ్వడం వలన చుట్టూ ఉన్న పంట పొలాలపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 2021లో అప్పటి తహసిల్దార్ మోర కమలాద్రి ఎలాంటి విచారణ చేపట్టకుండా ప్రభుత్వ భూమిని ప్రవేట్ వ్యక్తికి ఏ విధంగా లీజ్ ఇచ్చారని వాపోయారు. లీజ్ విషయం తమకు దృష్టికి రాగానే వెంటనే రైతులంతా కలిసి ప్రస్తుత తాహసిల్దార్ కి వినతిపత్రం ఇచ్చామని అట్టి మైనింగ్ అనుమతులపై విచారణ చేపట్టాలని కోరామని తెలిపారు. అదే విధంగా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు పట్నం సుధాకర్ రెడ్డి, ఝాన్సీ, ప్రభాకర్ రెడ్డి, మెగావత్ చిరంజీవి, శివరామకృష్ణ, గుగులోత్ వెంకన్న, భోజ్య సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.